Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ డైరెక్టర్ రాము
అంబర్‌పేట: ఏ రంగంలో విజయం సాధించాలన్నా ప్రొఫెషనలిజం చాలా ముఖ్యమని, మనకు ఆది పూర్తి స్థాయిలో లేకపోవడంతోనే ఫ్యాషన్ సహా ఇతర రంగాల్లో విదేశాలతో పూర్తిస్థాయిలో పోటీ పడలేక పోతున్నామని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ (నిఫ్డ్) డైరెక్టర్ కె.రాము ఆన్నారు. గురువారం బర్కత్‌పురలోని కళాశాలలో మొదటి రోజు ఫ్యాషన్ డిజైనింగ్‌లో అవగాహనా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో కనిపించే మార్పులే నూతన ఒరవడులను సృష్టిస్తాయని చెప్పారు. విద్యార్థులు ప్రతి అంశాన్నీ సునిశిత దృష్టితో పరిశీలించాలని తెలిపారు. విద్యార్థులకు ఫ్యాషన్ రంగ పట్ల సలహాలు, సూచనలు ఇచ్చారు. సీనియర్ విద్యార్థులు రూపొందించిన డిజైన్లను పరిశీలించారు.