Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట్
ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీకి ఈ నెల 24 నుంచి శ్రీకారం చుట్టనుంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్ పరిధిలో 27 కేంద్రాల ద్వారా వీటిని పంపిణీ చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి సర్కిల్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రానికి ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించారు. ఒక్కో కేంద్రానికి ఒక ఇన్చార్జిని ఏర్పాటు చేశారు.