Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నపాటి వర్షానికే
సముద్రాన్ని తలపిస్తున్న వర్షపునీరు
డెంగ్యూ వ్యాధి సోకే ప్రమాదం..
నవతెలంగాణ-ధూల్‌పేట్
రంజాన్, బోనాలు, గణేష్‌ల అభివృద్ధి బడ్జెట్ ఏమయ్యిందో అధికారులకే తెలియాలని స్థానికులు బాహటంగానే వాపోతు న్నారు. కంపును తొలగించకుండానే కాగితాలు రాసేస్తూ కాల యాపన చేస్తున్నారు. దీంతో ఎక్కడి మురుగు, చెత్త అక్కడే ఉన్నాయి. ఆ దారిగుండా రావాలంటేనే జంకుతున్నారు స్థాని కులు.. ఆ ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు నిత్యం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. విపరీతమైన ముక్కు పుటాల అధిరే దుర్వాస నతో సతమతమవుతున్నారు. అంతేకాదు ఆ పక్కలే ఫలక్‌నుమా ప్రభుత్వ జూనియర్ కళాశాల, పాఠశాలల విద్యార్థులు, ఇటుపక్క ఆస్పత్రి రోగులు ఆ దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా పాతబస్తీలో గల్లీగల్లీకి ఇదే పరిస్థితి దాపురించింది.
భయాందోళనలో...
పాతబస్తీలో కంపు రోజురోజుకూ పెరిగిపోతుంది. తరలించాల్సిన మున్సిపల్ అధికారులు, ఏఎంహెచ్ఓ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం ప్రజలకు అగాథంలోకి తోసేస్త్తోంది. ఓ పక్క డెంగ్యూ ప్రభలతోందని ప్రభుత్వాలు, వైద్యులు పేర్కొంటున్నా యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అటు వైపు చర్యలు తీసుకుంటున్నారనే దాఖలాలు లేవు. ఏదైన జరిగితేనే కానీ అధికారులు స్పందించరు. ఇది మన ప్రభుత్వ అధికారులకు బాగా అచ్చిపట్టింది. మీడియాలో మోగినా, పత్రికల్లో వచ్చినా అంతా మనదే అన్న చందరగా వ్యవహరిస్తున్నారు. ఏమి చేసినా అడిగే నాథుడే లేడనే ధోరణి అధికారులలో నాటుకపోయింది. దీంతో ఆడిందే ఆట, పాడిందే పాటగా కొనసాగుతోంది. చెత్తను తొలగించి బ్లీచింగ్‌పౌడర్ వంటి కొట్టాల్సిన సిబ్బంది అది కూడా స్వాహా చేస్తున్నారు.
పాతబస్తీ రాజన్నబావి, జంగంమెట్, ఉప్పుగూడ, చాంద్రా యణగుట్ట, ఫలక్‌నుమా, చార్మినార్, ఖిల్వత్, ముసాబౌలి, సిటీ కళాశాల, పేట్లబూర్జ్, పురాణపూల్, జుమ్మేరత్ బజార్, బేగం బజార్, అప్జల్‌గంజ్ తదితర ప్రాంతాలలో రహదారుల వెంట చెత్త చిద్రమవుతుంది. ఎక్కడికక్కడే పేరుకుపోయి కుళ్లిన వాసనతో మురుగును వెదజల్లుతోంది. ఇదిలా ఉంటే దీంట్లోనే పందులు స్వైర విహారం చేస్తున్నాయి. వాటి మధ్య నుంచి రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి. దీనికి తోడు కురిసిన వర్షంతో మురుగునీరు రోడ్లపైకి చేరింది. ఆ మురుగును భరించలేక స్థానిక నిత్యం ప్రజలు ఇబ్బందులనెదుర్కొంటున్నారు. ఎలాంటి విష రోగాలు దాపురిస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ అధికారులు కండ్లు తెరచి చెత్తను తొలగించాలని, బ్లీచింగ్ పౌడర్ వంటివి వేయాలని కోరుతున్నారు.