Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిలకలగూడ
సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ వసంత్ కుమార్ పది రోజుల కిందట ఇతర సిబ్బంది విధులకు ఆటంకం కలిగించాడని గాంధీ సూపరింటెండెంట్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేసిన విషయం తెలిసిందే. అందుకు నిరసనగా తనను అకారణంగా చేయని తప్పుకు విధుల నుంచి తప్పించారని భావించి మనస్థాపానికి గురై పెట్రోల్ డబ్బాతో గాంధీ ఆస్పత్రిలో హల్చల్ చేసిన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వసంత్ కుమార్ కి ఎట్టకేలకు పోస్టింగ్ లభించింది. అతనిని ముషీరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ ఆఫీసర్‌గా నియమిస్తూ మంగళవారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మంగళవారం విధులకు హాజరయ్యారు. కాగా గాంధీలో చోటుచేసుకున్న పరిణామాలపై దర్యాప్తు కొనసాగుతోంది.