Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఓయూ మారుతోంది... పచ్చదనం పరు చుకుంటోంది. వందేండ్ల చరిత్ర కల్గిన ఓయూలో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్‌కు హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) సిద్ధమైంది. ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో యుద్ధ ప్రాతిపదికన మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టింది.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆలోచనలకు అను గుణంగా పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు జంటనగరాలు, శివారు మున్సిపాలిటీల్లో ప్రజానీకానికి ఆహ్లాదాన్ని అందించడమే హెచ్ఎండీఏ లక్ష్య ంగా పెట్టుకుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ మార్గదర్శకంలో ఉస్మాని యావర్సిటీ ఇన్చార్జి వైస్ ఛాన్సీలర్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌కుమార్ పర్యవేక్షణలో సుధీర్ఘ చరి త్రను కలిగిన ఓయూ పరిధిలో హరితహారం ద్వారా ఐదు లక్షల మొక్కలను పెంచాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. దీంతో ఉద్యమాల అడ్డా ఉస్మానియావర్సిటీ భూములు తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా చిట్ట డవులకు కేంద్రంగా మారనున్నాయి. ఉస్మానియా వర్సిటీ ప్రధాన రహదారికి ఇరు వైపులా ఇప్పటికే ఉన్న చెట్లకు మధ్య హెచ్ఎండిఏ యంత్రాంగం మరి కొన్ని మొక్కలు పెంచుతున్నది. ఓయూ భూములు అన్యాక్రాంతం కాకు ండా కాపాడడంలో భాగంగా ఖాళీ స్థలాలు ఉన్న చోటల్లా పచ్చదనం కనిపించేలా విస్తత స్థాయిలో మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని హెచ్ఎండీఏ నిర్ణ యించింది.
పూలు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యత
ఉస్మానియా వర్సిటీకి పూర్వ వైభవం సంతరిం చేందుకుగాను కుందేళ్లు, నెమళ్లు ఇతర ఆటవీ పక్షులు అలారాడే విధంగా పూలు, పండ్ల మొక్కల పెంపకానికి హెచ్ఎండీఏ ప్రాధాన్యత ఇస్తున్నది. ఇందులో భాగంగా మర్రి, ఉసిరి, సీతాఫలం, దానిమ్మ, అల్లనేరేడు, కానుగ, వేప వంటి మొక్కలను నాటారు. వాటితో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్‌లో కంటికి ఇంపుగా కనిపించే పూల మొక్కలు టెకోమా గాడిచౌడి(ఎల్లోకలర్), రెండు మూడు రకాలకు చెందిన సిసల్ పినియా, నెమలినార, గుల్మొహర్, స్పాథోడియా, పెల్టోఫారమ్, సీసం వంటి పూల మొక్కలు నాటారు.
యాదాద్రి మోడల్ ప్లాంటేషన్
ఓయూలో ముఖ్యమైన ప్రాంతాల్లో యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ చేపట్టారు. వీటిలో ఉస్మానియా లైబ్రరీ,ఓయూ ఆడిటోరియం,డీ-హాస్టల్ సమీపంలోని ప్రాంతం, లా కాలేజ్ ఎదురుగా చేపడుతున్నారు. మరో ఏడు ప్రాంతాల్లో ఎవెన్యూ గ్యాప్ ప్లాంటింగ్, 253 ఎకరాల్లో రెండు మీటర్ల బ్లాక్ ప్లాంటింగ్ చేపడుతున్నారు.