అమెరికాలోని పెన్సిల్వేనియాలో ప్రతి యేడాది 2, ఫిబ్రవరిన గ్రౌండ్హాగ్ డే పెద్ద ఎత్తున జరుపుతారు. ఆ రోజు సంప్రదాయక సెలవు దినం.అమెరికా జానపదుల విశ్వాసం ప్రకారం గ్రౌండ్హాగ్ అనే చిన్న జంతువు ఈ రోజు దాని బొరియ నుంచి బయటికి వచ్చినప్పుడు ఆకాశం మబ్బులు కమ్మి ఉంటే వసంత రుతువు తొందరగా వస్తుందని నమ్ముతారు. అట్లా కాకుండా అది బయటికి వచ్చినప్పుడు బాగా ఎండగా ఉండి దాని నీడ దానికే కనిపించి బొరియలోకి వెళ్లిపోతే మరో ఆరు నెలలు శీతాకాలం కొనసాగుతుందని అర్థం చేసుకుంటారు. అయితే ఈ వాతావరణ జోస్యాలు ఎంతవరకు నిజమనేదే ప్రశ్నార్థకం. ఉదయాన్నే గ్రౌండ్హాగ్ బొరియ నుంచి రావడాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున గుమికూడతారు. ప్రజలు.ఆరోజున అక్కడ చేరినవారికి ఆహారాన్ని ఉచితంగా ఇస్తారు. అట్లాగే వినోదం కోసం చిన్న చిన్న స్కిట్లను ప్రదర్శింపచేస్తారు. ఉపన్యాసాలు ఇస్తారు. అక్కడ అందరూ పెన్సిల్వేనియా జర్మనీ యాసలోనే మాట్లాడుతారు. ఇంగ్లీషులో మాట్లాడేవారు జరిమానా చెల్లిస్తారు.