నైజీరియాలో పెండ్లికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన ఆచార సంప్రదాయాలు కనిపిస్తాయి. ఒక్కో తెగవారు కొన్ని ప్రత్యేక ఆచారాలకు ప్రసిద్ధి చెందారు. ఆ వివరాలే ఇవి..
పెండ్లి కూతురు నవ్వకూడదు
ఇజా తెగవారిలో ఆసక్తికరమైన ఆచారం ఉంది. పెండ్లి జరిగే సమయంలో పెండ్లికుమార్తె నవ్వకుండా ఉండాలి. ఒకవేళ నవ్వాలి అంటే ఆమె మీద పెండ్లికుమారుడు బోల్డంత డబ్బు గుమ్మరించాల్సి ఉంటుంది.
సాష్టాంగ నమస్కారం
యొరుబా ప్రజలు పెండ్లి ఎంగేజ్మెంట్ రోజున ఆచరించే ఆచారం ఆసక్తికరం. ఆరోజు పెండ్లికొడుకు తన స్నేహితులతో సహా పెండ్లికూతురి కుటుంబానికి సాష్టాంగ నమస్కారం చేయాలి. పెండ్లి తంతు ముగిసే లోపు మొత్తం నాలుగుసార్లు పెండ్లికొడుకు ఇట్లా సాంష్టాంగ నమస్కారం చేయాల్సి ఉంటుంది.
పెండ్లి కొడుకు కొరడా దెబ్బలు భరించాలి
ఫులాని తెగవారు పెండ్లికి ముందు పెండ్లికొడుకుని కొరడా తీసుకుని ఒట్టి పెయ్యిపై కొడతారు. అప్పుడు పెండ్లికొడుకు దెబ్బలకు తాళలేక అరిచినా, బాధపడినా పిల్లను ఇవ్వడానికి ఇష్టపడరు. అంటే పెండ్లి ఆగిపోతుందన్నమాట. ఈ పరీక్ష ద్వారా పెండ్లికుమారుని ధైర్యం, బాధను తట్టుకుని నిలబడగల శక్తిని పరీక్షిస్తారని అర్థమవుతుంది.
ముగ్గురిలో ఆ ఒక్కరు ఎవరు?
ఇగ్బో తెగలో పెండ్లికొడుక్కి ఒక పరీక్ష పెడతారు. అతడి దగ్గరకు ముసుగులు వేసిన ముగ్గురు అమ్మాయిల్ని పంపిస్తారు. ఆ ముగురిలో ఒకరు అసలైన పెండ్లికూతురు ఉంటుంది. ఆమెను గుర్తించడమే ఈ పరీక్ష.
Authorization