పూర్వపు యుగోస్లావియాలోని ఆరు రిపబ్లిక్లలో ఒకటి క్రొయేషియా. క్రొయేషియా ప్రజలు తాము చుట్టుపక్కల ఉన్న ఇతర రిపబ్లిక్లతో కన్నా ఆస్ట్రియాతోను, దాని సంస్కృతితోను సన్నిహిత సంబంధాలు ఉన్నవారిగా భావించుకుంటారు. తమ దేశాన్ని బాల్కన్ దేశంగా కన్నా యూరప్ దేశంగా భావించడానికి ఇష్టపడతారు.
ప్రస్తుతం ఉన్న క్రొయేషియన్ ప్రజలు 14 వందల ఏండ్లుగా ఇక్కడ నివసిస్తున్నారు. అంతకు ముందు సంస్కృతుల గుర్తులూ ఇంకా ఈ ప్రజల్లో కనిపిస్తాయి. నిజానికి క్రొయేషియా ఇటు పశ్చిమదేశాలు, అటు తూర్పుదేశాల ప్రభావానికి గురవ్వడానికి అనువైన భౌగోళిక ప్రదేశంలో ఉంది.
కళలు : క్రొయేషియా వాసులు రోమన్ కళా ప్రభావానికి గురయ్యారు. ముఖ్యంగా రోమన్ క్రైస్తవ చర్చిల భవన నిర్మాణ శైలి వీరిపై పడటం వల్ల అదే శైలిలో తమ దేవాలయాలను నిర్మించుకున్నారు. వారి శిల్పంలో 'వెల్ ఆఫ్ లైఫ్' చాలా ప్రసిద్ధి చెందింది. గోథిక్ పెయింటింగ్స్ ఉన్నా చాలా తక్కువగా రక్షితమై ఉన్నాయి. ఎక్కువగా ఫ్రెస్కో పెయింటింగ్స్‌నే వీరు సృష్టించారు. ఫెడ్రికో బెన్కోవిక్ అనే చిత్రకారుడు క్రొయేషియా పెయింటర్స్‌లో అతి ముఖ్యుడు. ఇతడు దాదాపు తన జీవితాంతం ఇటలీలోనే గడిపాడు.
ఇక సంగీతం విషయానికి వస్తే క్రొయేషియా మూజిక్పై రెండు ప్రభావాలు ఉన్నాయి. మధ్యయూరప్ ప్రభావం మధ్య, ఉత్తర క్రొయేషియా సంగీతంపై ఉంటే; కోస్తా ప్రాంత సంగీతంపై మధ్యదరా ప్రాంత ప్రభావం ఉంది. పాప్, రాక్ మ్యూజిక్‌లు ఇక్కడ మంచి ఆదరణ కలిగి ఉన్నాయి.
వివాహం : యువతీ యువకులు తమ భాగస్వామిని తామే ఎన్నుకుంటారు. స్కూల్, కాలేజీ, పని ప్రదేశాల్లో స్నేహితుల ద్వారా ఒకరికొకరు పరిచయం పెంచుకొని బంధాన్ని పెంచుకుంటారు. సాధారణంగా క్రొయేషియాలో యువత బృందాలుగా కాలం గడుపుతారు. ఓ జంటమధ్య సీరియస్ బంధం ఏర్పడిన తరువాత మాత్రమే తల్లిదండ్రులకు తమ సంగతి చెబు తారు. జాతి, మతం, చదువు, హోదా ఉన్న వారినే భాగస్వాములుగా ఎన్నుకోవడం యువతీయు వకులు చేస్తుంటారు. ఇరవైల్లోనే ఎక్కువగా పెండ్లిల్లు చేసుకుంటారు. విడాకులు కూడా ఎక్కువగానే కనిపిస్తాయి. వివాహానికి ముందే గర్భం దాల్చడమూ కనిపిస్తుంది. కొత్తగా పెండ్లయిన జంట ఎవరో ఒకరి తల్లిదండ్రులతో కాని, తాత ఇంట్లో కాని నివసిస్తారు. ఇందుకు ప్రధాన కారణం వారికి గృహాల కొరత ఉండటమే.
ఆస్తిని పిల్లలందరికీ లింగభేదం లేకుండా సమానంగా పంచుతారు తల్లిదండ్రులు. ఆస్తిలో ముఖ్యమైనది ఇల్లు లేక అపార్ట్మెంట్. సాధారణంగా కుటుంబంలో మగపిల్లవాడు కాని, ఆడపిల్లకాని ఎవరికో ఒకరికి (ఎవరు నివసిస్తే వారికి) ఇంటిని ఇస్తారు.
Authorization