మెండీ ప్రజలు పపువా న్యూగినియాలోని మెండీ లోయలో నివసిస్తారు. హంగల్ హెనెన్గ్ అనే భాషను ఎక్కువమంది మాట్లాడుతారు. తమ తెగ లేక వంశానికి సంబంధించినవారినే కాక బయటి వారినీ వివాహమాడతారు. పెండ్లిలో పెద్ద మొత్తంలో వధూవరుల కుటుంబాల మధ్య బహుమతులను ఇచ్చి పుచ్చుకుంటారు. ముఖ్యంగా పెండ్లి కుమార్తె వైపువారికి పెండ్లికొడుకు తరఫు నుండి ఎక్కువగా బహుమతులు అందు తాయి. మెండీ ప్రజల్లో బహు భార్యత్వం అసాధారణ విషయం కాదు. అట్లాగే భాగ స్వాములను మార్చుకునే ఆచారమూ కని పిస్తుంది. స్త్రీ పురుషుల్లో ఎవరైనా విడాకులు కోరుకోవచ్చు. విడాకులు తీసుకున్నప్పుడు ఎదుటివారి నుంచి తీసుకున్న బహుమతు లను తిరిగి ఇచ్చి వేయవలసి ఉంటుంది. తండ్రులు తమ సంతానానికి తమకున్న తోటలను పంచుతారు. తల్లిదండ్రులు మత పరమైన క్రియలకు సంబంధించిన సమాచా రాన్ని అందించి వారిని ఆ విషయంలో జ్ఞానవంతులను చేస్తారు.
పిల్లల పెంపకంలో స్త్రీపురుషులిరువురూ పాల్గొంటారు. అయితే తల్లులు, ఇంట్లో ఉన్న పెద్ద ఆడపిల్లలే ఎక్కువగా ఈ బాధ్యతను తీసుకుంటారు. హైలాండ్లో ఉండే మెండీలు తమ మగపిల్లలకు 'ఇనిషియేషన్' కార్యక్రమం జరిపించరు. కానీ మిగతా ప్రాంతాలలో ఈ కార్యక్రమం జరిపించే ఆచారం ఉంది. పిల్లలు ఒకరికొకరు బహు మతులు ఇచ్చుకొనేలా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు.
దేహాన్ని రంగులతో డిజైన్లు వేసుకోవడం, పక్షి ఈకలతో అలంకరించిన విగ్గులను ధరించడం పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. పబ్లిక్ ఈవెంట్స్ సందర్భంగా సామూహిక ప్రదర్శనలు ఉంటాయి. ఈ సందర్భంలో అనేక మంత్రాలు లాంటివి ఉచ్ఛరిస్తారు. స్త్రీపురుషులు ఇరువురూ వీటిని పాటల్లా గానం చేస్తారు.
ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబంవారికి బహుమతుల ద్వారా సహాయం చేసే ఆచారం ఉంది. మరణ కారణంపై చర్చ జరుగుతుంది. చనిపోయినవారిని స్థానిక స్మశానంలో మాత్రమే పూడ్చిపెడతారు. అట్లా చేస్తే స్థానికంగా ఉండే బంధుమిత్రులను ఆత్మలు కాపాడుతాయని భావిస్తారు.
-మౌక్తిక్
Authorization