కరేబియన్ దీవుల్లో ఒకటి అరూబ దీవి. ఇక్కడ అనేక సంస్కృతులు విలసిల్లుతున్నాయి. వెనిజూలా తీరానికి కేవలం 20 మైళ్ల దూరంలో ఈ దేశం ఉంది. కేవలం 70 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో ఉన్న ఈ దేశంలో 20 అంగుళాల కన్నా ఎక్కువ వర్షపాతం పడదు. అట్లాగే 28 డిగ్రీల సెల్షియస్ ఉగ్రోత ఉంటుంది. సంప్రదా యంగా పపియామెంటో భాషను మాట్లాడుతారు. ఒకటి రెండు ఇతర భాషలు కూడా మాట్లాడుతారు. కానీ అధికార భాష మాత్రం డచ్. బొనైర్, కుర్చావో ద్వీపాలతో కలిపి దీన్ని ఏబీసీ ఐస్లాండ్స్ అని పిలుస్తారు. అయితే ఈ ద్వీపాలు నెదర్లాండ్ రాచరిక పాలనలో ఒకప్పుడుండేవి కాబట్టి వీటిని డచ్ కరీబియన్ అని కూడా పిలుస్తారు. అరూబ రాజధాని ఒరెంజాస్టాడ్. మూడొంతుల మంది రోమన్ కాథలిక్ మతాన్ని అనుసరిస్తారు.
ఈ దేశంలో 92 దేశాలకు సంబంధించిన జాతీయులు నివసిస్తున్నారు. క్రిస్టమస్, నూతన సంవత్సరం సందర్భంగా దేశమంతా ఉత్సవాలు జరుపుకుంటారు. క్రిస్టమస్ సందర్భంగా గిటార్పై టిపికల్ సంగీతాన్ని ఆలపిస్తారు. నూతన సంవత్సరం సందర్భంగా దండె అనే రకానికి చెందిన పాటలు ఆలపిస్తారు. అయకా, పొంచిక్రీమా హామ్, ఇతర వంటకాలు, టపాసుల మోత న్యూ ఇయర్ స్పెషల్గా ఉంటాయి.
Authorization