అట్లాంటికి మహాసముద్రం తూర్పు తీరంలో ఉన్న నిరుపేద దేశం బహమాస్. ఇంగ్లీషు ఎక్కువగా మాట్లాడతారు. అందుకే దీన్నే అధికారభాషను చేశారు. ఈ దేశంలో మొదటగా నివసించడం ప్రారంభించింది 'లుక్కు-కెయిరిస్' (లుకయన్స్). అన్వేషకుడు క్రిస్టోఫర్ కొలంబస్ బహమాస్ ద్వీపాలను తన స్వదేశం స్పెయిన్‌కు చెందినవిగా ప్రకటించాడు. ఇక్కడ నివసించే అనేకమంది లుకయన్లు బానిసలుగా క్యూబా వంటి దేశాలకు తరలింపుకు గురయ్యారు. మిగతావారు తమ ద్వీపాలకు కొత్తగా వచ్చిన వారి వల్ల సంక్రమించిన జబ్బుల పాలబడ్డారు. అయితే స్పెయిన్వాళ్లు ఈ ద్వీపాల్లో స్థిరపడలేదు. అప్పట్లో ఈ ద్వీపాలు సముద్రపు దొంగలకు స్వర్గధామంగా మారాయి. 1629లో బ్రిటీష్‌వాళ్లు వీటిని తమ భూభాగాలని ప్రకటించారు. అమెరికా స్వతంత్ర సంగ్రామ సమయంలోను, ఆ తరువాత.. బ్రిటీష్ అనుకూలవాదులు ఇక్కడికి పారిపోయి వచ్చి స్థిరపడ్డారు. అదే సమయంలో ఆఫ్రికా నుంచి తరలించబడిన నల్లజాతి బానిసలు కూడా పెరుగుతూ వచ్చారు. 18వ శతాబ్దం నుంచి నల్లజాతీయుల సంఖ్య తెల్లవాళ్ల కంటే పెరిగిపోసాగింది.
విభిన్న సంస్కృతి
బహమాస్‌లో అటు నల్లవారు ఇటు తెల్లవారు (బ్రిటీషర్స్) అనుసరించే ఆచార, సంప్రదాయాల మిశ్రమంతో కొత్త సంస్కృతి జీవం పోసుకుంది. బ్రిటీష్‌వాళ్లు ఇంగ్లీషు, ప్రొటెస్టెంటిజం, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఇక్కడ పాదుకొనడానికి కారకులయ్యారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రజలు సంగీత పద్ధతులు, పరికరాలు, నృత్యపద్ధతులు, మతపరమైన భావనలు, జానపద కథలు, కుటుంబ నమూనాలు, భాఫాపరమైన ప్రభావాలు తీసుకువచ్చారు. ఫలితంగా కొత్త విశ్వాస వ్యవస్థ ఉద్భవించింది. తోటలు, బానిస తిరుగుబాటులు, వలస పాలన, దీవులుగా ఉన్న భూభాగం, సముద్రం, హరికేన్లు వంటి అనేక ఇతర అంశాలు కూడా బహమాస్‌లో సాంస్కృతిక సంస్లేషణకు కారణమయ్యాయి. 1973 వరకు బ్రిటీష్‌వాళ్ల అధికారంలోనే ఉన్న ఈ దీవులు శాంతియుతంగానే స్వతంత్య్రాన్ని పొందాయి.
ఆహార పానీయాలు
పండ్లు, కూరగాయలు, చేపలు, మాంసం, బ్రెడ్, అన్నం... ఇవీ ప్రజలు తీసుకునే ఆహార పదార్థాలు. నత్తగుల్లలు, బటాని జాతీయ వంటకాలుగా పరిగణిస్తారు. పేద ప్రజలు అన్నంతో కలిపి వీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఇవి ఎక్కువగాను, చౌకగాను లభించడమే ఇందుకు కారణం. సంపన్నులు ఈ వంటకాలను 'హెరిటేజ్ ఫుడ్స్'గా భావిసా్తరు. పండుగలు పబ్బాలు, సెలవు దినాల సందర్భంలో లోకల్‌గా లభించే చేపలు, నత్త గుల్లలు, బటాని రైస్, బ్రెడ్లు, తాజా పండ్లు వడ్డనలో ఉంటాయి. బహమాస్‌లో తయారయ్యే రమ్, బీర్, ఇంపోర్టెడ్ బీర్, సాఫ్ట్ డ్రింక్స్, టీ, కాఫీ వంటి పానీయాలను రోజువారీగా తీసుకుంటారు.
Authorization