నైజీరియాలోరి కొన్ని తెగల్లో పెండ్లిళ్లకు బహిరంగ ఆహ్వానం ఉంటుంది. అంటే ఎవరైనా వివాహానికి రావచ్చన్నమాట. అందుకే అక్కడ వివాహాలు పెద్ద పెద ఈవెంట్లుగా కనిపిస్తాయి. కొన్ని తెగల్లో వివాహానికి సంబంధించి ప్రత్యేక ఆచారాలు దర్శనమిస్తాయి. ఉదాహరణకు ఇగ్బో తెగనే చూడండి. వీరిలో పెండ్లికూతురు తరఫువారు వివాహానికి ముందు వరునికి కొనవలసిన వస్తువుల లిస్టును పంపిస్తారు. దాంట్లో కొత్త కారు ఉండవచ్చు లేక మొసలి దంతమూ ఉండవచ్చు. ఆ జాబితాలో ఏ ఒక్క వస్తువును తీసుకురాకపోయినా అమ్మాయిని చేసుకోవడానికి నిరాకరిస్తారు.
ఎవరో కొంతమంది పాశ్చాత్య దేశాల వెడ్డింగ్ గౌను ధరిస్తున్నారు కానీ చాలా మంది పెండ్లికూతుర్లు ఇగ్బో జాతి ఆచారం అనుసరించి సముద్రపు గవ్వలు, పూసల దండలను ధరిస్తారు. రంగు రంగుల లేసులతోను, రేపర్లతోను తయారు చేసిన జాకెట్లను, స్కర్టులను ధరిస్తారు. పెళ్ళి సందర్భంలో వధువుపై డబ్బులను వెదజల్లుతారు. ముఖ్యంగా ఆమె నాట్యం చేసేటప్పుడు ఈ వ్యవహారం జరుగుతుంది.
హాసా తెగలో వరుడు తన వధువు పట్ల ఎంత ప్రేమను కలిగి ఉన్నాడో నిరూపించుకోవడానికి ఒక పరీక్షలో పాసవ్వాల్సి ఉంటుంది. ఇంతకు ఆ పరీక్ష ఏంటో తెలుసా... వంద కొరడా దెబ్బలు భరించడం!
Authorization