సౌతి జా బుసరా అనేది జాంజిబార్ (టాంజానియా)లో జరిగే అద్భుతమైన మ్యూజిక్ ఫెస్టివల్. ప్రతి ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఈ అంతర్జాతీయ పండుగ రోజుల్లో జాంజిబార్ ఉత్సాహంతో ఉప్పొంగుతుంది. తూర్పు ఆఫ్రికాలో పేరెన్నిక గన్న సుమారు నాలుగువందల మంది పాటగాళ్ళు ఈ పండుగలో పాల్గొంటారు. ఇందులో ప్రముఖులు, ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న సంగీత విద్వాంసులు కూడా ఉంటారు.సంప్రదాయ సంగీతం నుంచి ఆధునిక సంగీతం వరకు అన్ని రకాల సంగీతానికి ఇందులో స్థానం ఉంది. ఈ మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభం రోజున రోడ్డు పొడవునా సంగీత కళాకారుల పెరేడ్ జరుగుతుంది. ఆ తరువాత నాలుగు రోజుల పాటు స్టోన్టౌన్ చారిత్రక కోట దగ్గర గానా భజానా ఉంటుంది.