ఇండొనేషియా అనేక ఆచార సంప్రదాయాలకు నిలయం. ఆ దేశం అనేక ద్వీపాల సముదాయం. ఇందులో బాలీ ద్వీపం ఒకటి. ఈ ద్వీపంలో యుక్తవయసుకు వచ్చిన ఆడపిల్లలు సంపన్న, పేద అనే తేడాలు లేకుండా అందరూ ఒక ఉత్సవం నిర్వహించి కోర దంతాలను అరగదీయడం ఆచారంగా వస్తున్నది. మానవులకు సహజంగా ఉండే ఆరు చెడ్డలక్షణాలను వదిలించుకోవడానికి లేదా ఆ లక్షణాల బారిన పడకుండా ఉండటానికి ఇట్లా పండ్లను అరగదీస్తారు. అట్లా అరగదీసినప్పుడే వారు ఈడుకొచ్చినట్లు గుర్తింపు పొందుతారనీ చెబుతారు. ఈ సంప్రదాయ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇందుకు చాలా ఖర్చుకూడా అవుతుందట. ఈ ఖర్చును భరించడానికి స్వచ్ఛంద సేవాసంస్థలు కూడా ఉన్నాయంట.