చాలా దేశాల్లో ఇంటికి ఎవరైనా వస్తే తాగడానికి మంచి నీళ్లు ఇచ్చిన తర్వాత టీ ఇవ్వడం సర్వసాధారణ దృశ్యం. టీ, కాఫీలు ఇవ్వడం ద్వారా కనీస ఆతిథ్యాన్నిచ్చి అతిథులను గౌరవించి నట్టు భావిస్తారు. కానీ ఉభయ కొరియా దేశాల్లో టీ అంతకు మించిన పాత్రను పోషిస్తున్నది.
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల ప్రజల సంస్కృతిలో టీ ఒక భాగంగా ఉంది. టీ పానీయం తో ముడివడిన క్రతువును ప్రత్యేకించి వీరు నిర్వహిస్తారు. తమ జాతిలో ప్రశాంతత, మానవులకు సుఖశాంతులు చేకూరాలని ఈ క్రతువు నిర్వహిస్తారు. కొరియాను కోర్యో వంశం (క్రీస్తు శకం పది నుంచి పధ్నాలుగు శతాబ్దాల మధ్య) ఏలిన కాలంలో టీ కొరియా ప్రజల సంస్కృతిలో చాలా ప్రముఖ పాత్ర పోషించింది. కవిత్వం, నాటకం, కళ, పాట వంటి అంశాల్లో దాని ముద్ర తిరస్కరించడానికి వీలులేనిదిగా చెప్పవచ్చు. 'చార్యే' అనే క్రతువును నిర్వహించి టీ ఇవ్వడం ఒక ఆచారంగా ఉండేది. కొరియా టీ పాత్రలు చాలా ప్రసిద్ధి చెందాయి. జపాన్ పాలన కింద కొరియా ఉన్నప్పుడు అనేకమంది టీ పాత్రలు తయారుచేసే కొరియా పౌరులను జపాన్ తీసుకువెళ్ళి అక్కడ ఈ పాత్రలను తయారు చేయించారు. అప్పట్లో తయారు చేసిన ఆ పాత్రలు ఇప్పుడు అత్యంతవిలువైనవాటిగా పరిగణిస్తున్నారు జపనీయులు. కొరియా బౌద్ధ సన్యాసులు తమ మత ప్రచారానికి ఎక్కడికి వెళ్ళినా అక్కడ తమ టీ పాత్రల ప్రత్యేకతనూ వారసత్వంంగా సంక్రమింపచేశారు. టీ క్రతువు సబి, వబీ అనే రెండు సూత్రాలకు సంకేతంగా భావిస్తారు. వబీ అంత్ణసౌందర్యానికి, సబీ బాహ్య ప్రపంచచానికి ప్రతీకలుగా చెబుతారు. హాన్-ట అనే టీ క్రతువును నిర్వహించే బౌద్ధ మతస్తులు బౌద్ధ దేవాలయాల్లో (ఆరామాల్లో) బుద్ధుని విగ్రహాలకు గ్రీన్ టీని నైవేద్యంగా సమర్పిస్తారు.
Authorization