మనం పోష్‌గా 'లివింగ్ టుగెదర్' అరటున్నాం. అదేదో కొత్తగా కనిపెట్టినట్టుగా అనుకుంటాం. కానీ ఆదివాసీ సమాజాల్లో అదొక ఆచారంగా కూడా ఉన్నది. సహజీవనంతోనే వారు పిల్లల్ని కంటారు. ఎప్పుడో చాలా కాలానికి పరిస్థితులు అనుకూలిస్తే పెండ్లి చేసుకుంటారు. ఉత్తర బస్తర్ కారకేర్ జిల్లా అబూజ్‌మాడ్‌లో గోండుల్లో ఈ పద్ధతి ఉన్నది. దీనినే వారు 'ఇల్లు జొచ్చడం' అరటారు.
అలాంటిది కన్యాశుల్కం కింద ఓ ఆవును, పందిని, కొన్ని సీసాల లందను, ఇప్పసారాను అడుగుతారు సహజంగా. కొంతమంది ఓ ఐదు వందల రూపాయలో రెండువేల రూపాయలో కూడా అడగవచ్చు. డబ్బులు వారి చేతిలో సాధారణంగా ఉండవు. తునికి ఆకు తెంపడం వల్ల, వెదురు నరకడం వల్ల మాత్రమే వారికి డబ్బు అరదుతుంది. మార్కెట్‌కి సాధారణంగా అటవీ ఉత్పత్తులు తీసుకుని వెళ్లి వాటిని ఇచ్చి, వారికి కావాల్సిన వస్తువులను తెచ్చుకురటారు.
ఈ డబ్బు చెల్లించలేనివారు, లేదా వారు కోరినన్ని సీసాల ఇప్పసారాను చెల్లించలేని వారు పెళ్లి చేసుకోలేరు. అవతలి నుంచి అమ్మాయికి వేరే పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలుపెడతారు. విధిలేని స్థితిలో ఆ అమ్మాయి... ఓ జత బట్టలు తీసుకుని ఇష్టపడిన వాడి ఇల్లు జొచ్చుతుంది.
ఇక ఆ జంటను ఎవరూ విడదీయలేరు. విడదీయకూడదు. అది వారి కట్టుబాటు. అయితే ఎప్పటికైనాసరే కన్యాశుల్కం ఆ అబ్బాయి చెల్లించాల్సిందే. అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ కష్టపడి కూడబెట్టుకుని కన్యాశుల్కం చెల్లించి, అరదరికీ విరదు ఏర్పాటు చేస్తారు. అప్పుడు పెళ్లి అయినట్టు.
కన్యాశుల్కం చెల్లించని వారు కలిసి కాపురం చేస్తారు. పిల్లలను కూడా కరటారు. సమాజం అరతా వీరి జంటను ఆమోదిస్తది. అయినా వారికి పెళ్లి కానట్టే. ఎందుకంటే కన్యాశుల్కం చెల్లించలేదు కాబట్టి. అయితే అమ్మాయి తల్లిదండ్రుల నుంచి కన్యాశుల్కం చెల్లించాలనే ఒత్తిడి ఉంటది. అయినప్పటికీ అమ్మాయిని మాత్రం తీసుకుపోలేరు. పోకూడదు.
కన్యాశుల్కం ఉన్నప్పటికీ అరదులోనూ కొన్ని వెసులుబాట్లను ఇట్లా ప్రవేశపెట్టారు. ఈ రకం పెళ్లికి అమ్మాయి ధైర్యం చేయడమే ముఖ్యం. ఒకరకంగా ఆదివాసుల్లో పెళ్లి విషయంలో అమ్మాయిలకు కొంత స్వేచ్ఛ ఉన్నట్టే కనిపిస్తది. కానీ అదే సమయంలో అమ్మాయికి ఇష్టర లేకపోయినా ఎత్తుకుని వెళ్లి చేసుకునే రాక్షస పెళ్లిళ్లు కూడా ఉన్నాయి.
అలాగే అమ్మాయి చిన్నగా ఉన్నప్పుడే గోర్గ కల్లునో, లందనో, ఇప్పసారానో తాగి పిల్లనిస్తామని బాస చేసిన తల్లిదండ్రులు అమ్మాయికి ఇష్టం లేకపోయినా బలవంతంగా చేసే పెళ్లిళ్లూ ఉన్నాయి.
కన్యాశుల్కం చెల్లించి చేసుకురటారు కాబట్టి ఒకవేళ ఆ అమ్మాయి భర్త ఏదేని పరిస్థితిలో చనిపోతే, భర్త అన్నదమ్ములకు ఆమెపై సర్వ హక్కులూ ఉంటాయి. భర్త అన్నదమ్ముల్లో ఎవరో ఒకరి సొంతం ఆమె. లేదా మంచి కన్యాశుల్కం వస్తుందనుకుంటే ఆమెకు ఇష్టమున్నా లేకున్నా మరొకరికి ఇచ్చి చేసే పెళ్లిళ్లూ ఉన్నాయి.
Authorization