రామానగరాన్ని 'సిల్క్ సిటీ' అని అంటారు. ఇది బెంగుళూరుకు నైరుతి దిశగా 58 కిలో మీటర్ల దూరంలో ఉంది. రామానగరం జిల్లాకు ప్రధాన నగరం. కర్నాటక మాదిరిగానే... గంగాలు, చోళులు, హొయసలులు, మైసూరు పాలకులచే పాలించబడింది. 1970 లలో ఈ ప్రాంతంలో సినిమా షుటింగ్ లు బాగా జరగడం వల్ల రామానగరం బాగా పేరుగాంచింది. రామానగరం పెద్ద కొండ ప్రాంతం. ఏడు పెద్ద పెద్ద కొండలు ఉంటాయి. అవి శివరామగిరి, సోమగిరి, క్రిష్టగిరి, యతిరాజగిరి, రేవణ్ణ సిద్ధేవ్వర, సిడిలకల్లు, జల సిద్ధేశ్వర. ఈ నగరంలో పట్టు పరిశ్రమలు అధికంగా ఉండటంతో దీన్ని 'సిల్క్ సిటీ' అని అంటారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మైసూరు సిల్క్ చీరలు రామానగరం నుంచి తయారైన పట్టుతోనే తయారు చేయబడతాయి.
ఈ కొండ ప్రాంతాలు పక్షులకు నివాస స్థలాలు. పక్షుల నివాసం కావడం వలన ప్రకృతి ప్రియులు ఇక్కడకు వచ్చి పరవశించి పోతారు. ఈ ప్రదేశంలో కర్నాటకలోని జానపద కళలు, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. చుట్టూ కొండలుండటం వలన, పర్వతారోహకులకు ఇది ఒక స్వర్గంగా ఉంటుంది. ఈ కారణంగా ఇక్కడ టూరిజం బాగా వ్యాప్తి చెందింది. బెంగుళూరు, మైసూరు జాతీయ రహదారి పై ఉంది. ఈ రెండు నగరాల నుండి పర్యాటకులు రామానగరాన్ని చెరుకోవచ్చు. ఓ
Authorization