సాహస క్రీడాకారులకు అంతరగంగ ప్రదేశం బాగా నచ్చుతుంది. అంతరగంగ అంటే నిరంతరం ప్రవహించే నీరు. ఇది కర్నాటకలోని కోలార్ జిల్లాకు తూర్పు భాగంలో కొండలపై ఉంది. ఈ ప్రవాహం పెద్ద పెద్ద రాళ్ళ మధ్య నుండి ప్రవహిస్తూ కొండల మీద నుండి దుముకుతుంది. ఈ కొండ చరియల శ్రేణిపై దట్టమైన అడవి కూడా ఉంది. అంతరగంగ అందాలు దాని రాతి నిర్మాణాలలోను, గుహల లోను ఉన్నాయి. సాహస క్రీడలు ఇష్టపడేవారికి ఈ ప్రదేశం మరువలేని అనుభూతులను ఇస్తుంది. అలాగే ట్రెక్కింగ్ చేసే వారికి కొండ మీదకు ఎక్కాలన్నా... కింది భాగానికి చేరుకోవాలన్నా చాలా తక్కువ సమయం పడుతుంది. ఈ ప్రదేశంలో మతపరమైన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం కనిపి స్తుంది. సెలవు రోజుల్లోనే కాదు నిరంతర ప్రవాహాన్ని, పురాతన దేవాలయాలను దర్శిస్తుంటారు పర్యాటకులు. వాస్తవానికి ఈ ప్రవాహం దేవాలయంలో ఒక భాగమైన ఒక రాతి ఎద్దు నోటికి వెళ్లి ఆగిపోతుంది.
ఈ కొండలలో అంతరగంగ గుహలు కూడా ఉన్నాయి. ఇవి అగ్ని పర్వతాల విస్పోటనం తర్వాత ఏర్పడ్డాయని చెబుతారు స్థానికులు. కాలక్రమంలో రాళ్ళు కరిగి గుహలుగా మారాయి. ఈ గుహలు పర్యాటకులకు ఆసక్తి కలిగిస్తాయి. కొన్ని గుహలలోకి సందర్శకులు పాక్కుంటూ వెళ్లవలసి వస్తుంది. ఈ ప్రాంతంలో గుహలే కాకుండా కొన్ని పురాతన దేవాలయాలు, మత కేంద్రాలను కూడా సందర్శించవచ్చు. బెంగుళూరుకు 70 కిలో మీటర్ల దూరంలో ఉంది. ట్రెక్కింగ్, రోపింగ్ వంటివి చేయవచ్చు. కొండల మధ్యలో నుంచి నీటి ప్రవాహాలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక్కడి వాతావరణం నిరంతరం చల్లగా, ఆహ్లాదభరితంగా ఉంటుంది.ఓ
Authorization