రాజస్థాన్ లోని ఆరావళి పర్వత శ్రేణులలో ఎత్తు పల్లాల మధ్య ఉన్న పర్వత ప్రాంతం అల్వార్. ఈ ప్రాంతం అల్వార్ జిల్లాకు పరిపాలనా కేంద్రం. ఈ ప్రాంతాన్ని మేవార్ అని కూడా పిలుస్తారు. అల్వార్ అందమైన సరస్సులకు, గొప్ప భవనాలకు, అద్భుతమైన స్మారక కట్టడాలకు, కోట బురుజులకు ప్రసిద్ధి చెందింది. కోటలు, భవనాలు, సరస్సులు, మ్యూజియం, అల్వార్ కోట ఇలా ఎన్నో.. పర్యాటక ప్రదేశాలను ఇక్కడ చూడవచ్చు. ఇక్కడి కోటల నిర్మాణ శైలి పర్యాటకుల దష్టిని ఆకర్షిస్తుంది. ముఖ్యంగా అల్వార్ కోట కు జై పోల్, లక్ష్మణ్ పోల్, సూరత్ పోల్, చాంద్ పోల్, అంధేరీ గేటు, కష్ణ గేటు అనే ఆరు ద్వారాలు ఉన్నాయి. సిటీ భవనం, విజయ మందిరం అల్వార్ లోని ఇతర ఆకట్టుకునే ప్రదేశాలు. విజయ మందిరం ఒక అద్భుత కట్టడం. ఈ మందిరంలో 105 గదులు, అందమైన పూల తోట, ఒక సరస్సు ఉంటుంది. దాంతో పాటు జై సమాండ్ సరస్సు, సిలి సెర్ సరస్సు, సాగర్ సరస్సు కూడా ఈ ప్రాంతంలోని ఇతర పర్యాటక ఆకర్షణలు. అల్వార్ పర్యాటనకు వెళ్లినప్పుడు మహారాణికి చాత్రి, త్రిపోలియ, మోతీ డూంగ్రీ, భంగర్ శిథిóలాలు, కంపెనీ బాఫ్‌ు, క్లాక్ టవర్, ప్రభుత్వ మ్యూజియం, ఫతెV్‌ా జంగ్ సమాధి, కలాకాండ్ మార్కెట్, నలదేశ్వర్లను సందర్శించవచ్చు. అల్వార్ కు చేరుకోవడానికి రైలు, రోడ్డు మార్గాలు ఉన్నాయి. అలాగే జైపూర్ లోని సంగానేర్ విమానాశ్రయం అల్వార్ కు సమీపంలో ఉంటుంది. విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతానికి న్యూ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా చేరుకుంటారు. అల్వార్ రైల్వే స్టేషన్ నుండి ఢిల్లీ, జై పూర్ కు చక్కటి రైలు సౌకర్యం కూడా ఉంది. అల్వార్ ప్రాంతంలో వాతావరణం ఏడాది పొడవున పొడిగా ఉంటుంది.
Authorization