ఇది కేరళలో ఉన్న ఓ అందమైన ప్రదేశం తేక్కడి. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 900-1800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. తేక్కడి అనే పేరు వినగానే మనకు ఏనుగులు, విడిపోయిన కొండలు, సుగంధ ద్రవ్యాల వాసనలు విరజిమ్మే తోటలు గుర్తుకు వస్తాయి. ఇంకా భారతదేశంలో ఉన్న అత్యద్భుతమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల్లో ఒకటి పెరియార్ అడవి. జంతు ప్రేమికులకు ఇది చక్కటి ప్రదేశం. అందమైన తోటలు, ఎత్తైన పర్వతాలపై నడక, ట్రెక్కింగ్ పర్యాటకులను మరింత అబ్బురపరుస్తాయి.
కుమిలి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తేక్కడి. వివిధ ప్రాంతాల నుంచి తరచుగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. పెరియార్ అడవి లో నివాసించే పక్షులు, జంతువులు, మొక్కల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అడవిలో కనిపించే కొన్ని ఆసక్తికరమైన విషయాలు... ఈ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రంలో మొత్తం 1965 పుష్పించే మొక్కల్లో 171 గడ్డి రకాలు, 143 ఆర్కిడ్ రకాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశ కోనిఫెరస్ పోడోకార్పస్ వలిచైనస్లు కేవలం ఇక్కడే ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ జంతు సంపదకు కొదువే లేదు. 35 రకాల్లో కనిపించే ఏనుగులు, సాంబార్ డీర్, అడవి ఎలుగుబంట్లు ఉంటాయి. దీనికి దిగువ ప్రాంతంలో నీలగిరీ తార్ అనే అరుదైన జీవిని చూడవచ్చు. అదే విధంగా రాతి ప్రదేశాల్లో ఉండే సింహాం, కోతులు, మలాబార్ జెయింట్ ఉడతలు, ఎగిరే ఉడతలు, పులి, అడవి పిల్లి, స్లాత్ బేర్ వంటివి కనిపిస్తాయి. ఇంకా ఇక్కడ వలస వచ్చిన పక్షులతో సహా 265 ఉంటాయి. హార్న్, కొంగ, వడ్రంగి పిట్ట, చెకుముకి పిట్ట, రాస్టర్, నీటికాకి, గ్రాకెల్, డార్టర్ మొదలైనవి.
సరీసృపాలైన కోబ్రా, తాచుపాము, కట్లపాము, విషం లేని అనేక పాములు, మానిటర్ బల్లి కనిపిస్తాయి. కప్పలతో పాటు రంగురంగుల మలబార్ గ్లైడిరగ్ కప్ప, కామన్ ఇండియన్ చిరుకప్ప, ఫన్గోయిడ్ కప్ప వంటి ఉభయచరాలు చాలా ఉంటాయి. పెరియర్ వాగులు, వంకల్లో అనేక రకాల జాతుల చేపలు కనిపిస్తాయి. ముషేర్, అదృశ్యమైపోతున్న భారతదేశ గేమ్ఫిష్ వంటివి ఉంటాయి. వోట్టర్ సరస్సులో ఉండే ఏకైక క్షీరదం. బోట్లో ప్రయాణించేటప్పుడు దీన్ని గమనించవచ్చు. తోటలు, టీ, యాలకులు, మిరియాల చెట్లు, కాఫీ తోటలు పెరియార్ వన్య సంరక్షణ కేంద్రం చుట్టూ ఉన్నాయి. ఇక పెరియార్ అడవిలోపల రెండు రకాల వాచ్ టవర్లు ఉంటాయి. ఫారెస్టు ఇన్ఫర్మేషన్ సెంటర్, ఇక్కడికి వెళ్లటానికి తెక్కడిలోనే రిజర్వేషన్లు చేసుకోవచ్చు.
Authorization