తైఫ్... సౌది అరేబియా దేశంలోని అల్-సరావత్ పర్వతాల తూర్పు ప్రాంతం లో ఉంది. ఇది గొప్ప సంస్కతి కలిగిన నగరం. ఎన్నో సుందరమైన ఎత్తైన పర్వతాల మధ్య వెలసిన నగరం తైఫ్.ఇక్కడ పర్యాటకులకు హదయానందం కలిగించే ఎన్నో ప్రదేశాలున్నాయి. సాధారణంగా సౌదీయులకు ఇదో వేసవి రాజధాని. సౌది అరేబియాలోని వేసవి వేడిని తప్పించుకొని ఇక్కడి చల్లని వాతావరణ ఆనందాన్ని పొందడానికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. కింగ్ డమ్ ఆఫ్ సౌది అరేబియా లోని వివిధ ట్రైబ్స్ (ఆదివాసీిలు) పేర్లను అనుసరించి 'తైఫ్ ' అని పేరు పెట్టారు. వ్యవహారిక భాషలో 'తాయఫ్ ' అని కూడా పిలుస్తారు. సౌది అరేబియా లోని రెండవ ఎత్తైన పర్వత ప్రదేశంలో ఉన్న అల్-షఫా పర్వతం పై అల్-షఫా అనే చిన్న గ్రామం వెలిసింది. ఇక్కడి స్వచ్ఛమైన పర్వత గాలిని ఆస్వాదిస్తే కలిగే ఆనందనం వర్ణానాతీతం. ఇది సముద్రమట్టానికి 2,200 - 2,500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కాబట్టి వ్యవసాయ ఉత్పత్తి గ్రామంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒంటెల పై స్వారీ చేయడం ఓ ఉత్సాహం.
సమ్మర్ సీజన్లో హోటళ్లన్నీ వందశాతం బుక్ అయి పోతాయి. అందుకే తైఫ్‌లో ఓ రెండు రోజులుండి ఇక్కడి పర్యాటక దశ్యాలను చూసి ఆనందం పొందాలంటే అడ్వాన్స్‌గా హోటల్ గాని లేదా అపార్ట్ మెంట్ గాని బుక్ చేసుకోవాలి. జెద్దా, మక్కా నగరాల నుంచి వచ్చే వాళ్లు తెల్లావారుజామున ఆరుగంటలకు బయలుదేరితే రాత్రి వరకు ఇక్కడ గడిపి, అర్థ రాత్రికి ఇంటికి చేరుకోవచ్చు. వీకెండ్ రోజుల్లో చూడదగిన ప్రదేశాలు...
శుబ్ర ప్యాలెస్: శుబ్ర ప్యాలెస్‌ను 150 సంవత్సరాల క్రితం నిర్మిం చారు. ఇది అబ్దుల్లా బెన్ ఔన్ నివాసం. కాని 1949లో కింగ్ అబ్దుల్ అజీజ్ దీన్ని రాయల్ ఫ్యామిలీ కోసం కొన్నారు. ఆ తర్వాత వేసవి గహంగా మార్చాడు. ఇందులో 155 గదులు ఉన్నాయి. ఇప్పుడది పురాతన హిజాజ్ చారిత్రాత్మక ప్రదేశం. ప్రస్తుతం మ్యూజియంగా మార్చడంతో పర్యాటకుల సందడి పెరిగింది.
టర్కిష్ ఫోర్ట్: ఇది చారిత్రాత్మక ఆకర్షణ గల ఓట్టొమన్ కాలం నాటి కట్టడం. ఆ కాలంలో ఇది సైనిక స్థావరం. ఇది రాక్ క్వారింగ్స్ దగ్గర ఉంది. 1917లో లారెన్స్ ఆఫ్ అరేబియా పోరాడారని చరిత్ర చెబుతున్నది. టర్కిష్ ఫోర్ట్‌ను కచ్చితంగా చూడవల్సిన ప్రదేశంగా చెప్పుకోవచ్చు.
అల్-హద మౌంటైన్స్: ఈ మౌంటైన్స్ ఓ ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడికి వెళ్లే ముందు అంటే హై వే దగ్గర కోతులు అధిక సంఖ్యలో దర్శనమిస్తాయి. పర్యాటకులు అందించే తాజా పండ్లను కోతులు బాగా ఇష్టపడతాయి. చాలా సార్లు పండ్ల కోసం దాడులు కూడా చేస్తుంటాయి కోతులు. కొందరికిది ఆనంద మైన రిస్క్! నడుపుతూన్న కార్ల పై కోతులు రాళ్లు రువ్వడం. కార్లు అదను తప్పి ఆక్సిడెంట్ కావడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది.
అల్-హద్లో కేబుల్ కార్ ద్వారా పర్యాటకులకు తైఫ్ పర్వతాల అద్భుత దశ్యాలను చూడడానికి వీలుంటుంది. ఇది సౌది అరేబియా, ప్రాచ్య దేశాలలో ఉన్న అతి పెద్ద కేబుల్ కార్.
నేషనల్ మ్యూజియం: పర్యాటకులకు కుతూహలాన్ని పెంచే మ్యూజయంగా దీన్ని చెప్పుకోవచ్చు. సౌది అరేబియాలోని పూర్వం వినియోగించిన టెక్నాలజీ, సౌది చరిత్ర గురించి నేషనల్ మ్యూజియంలో తెలుసుకోవచ్చు. ఈ మ్యూజియంలో ముఖ్యంగా ఎడారిలో 'బిదుయిన్స్' (ఎడారి లో జీవనం గడిపే తెగ) ఉపయోగించే పరికరాలు, పని ముట్లు, వారి దుస్తువులు వగైర వగైరాలు చక్కగా అమర్చబడి ఉంటాయి.
పురాతన కోట: ఈ కోట పర్యాటకులకు ఆకర్షితమైన ల్యాండ్ మార్క్. ఈ కోట ఆర్కిటెక్చర్ ప్రత్యేకంగా శత్రువుల దాడికి తట్టుకునేలా, కంట్రోల్ టవర్స్‌తో నిర్మించారు. ఇది ఇస్లామిక్ కల్చర్‌ను ఇనుముడింపజేసేలా ఉన్నది. పురాతన కోట తైఫ్ కు పశ్చిమాన ఉంటుంది. పురాతన కోటగా విరాజిల్లుతూ, ప్రత్యేక సాంకేతిక నైపుణ్యంతో, రాళ్లతో కట్టబడిన ఈ కోటలోని రాళ్ళు గాలి, తుఫానులు, శీతల గాలులను, వేసవి వేడి నుంచి కాపాడేలాగ ఈ కోటను నిర్మించారు. కోట పై అంతస్థులో ప్రత్యేక నిఘా గదులు ఉంటాయి. కోటయజమాని ఏ లాంటి గొడవలు, ఆక్రమణలు జరిగిన వాటిని గమనించడానికి, వీక్షిం చడానికి వీలుగా ఉండేది. కోటలోని చెక్కలతో తయారు చేసిన హస్తకళ నైపుణ్యానికి పర్యాటకులు ముగ్ధులవు తుంటారు.
అల్-మస్సార ఇంటర్నేషనల్ ఈక్విస్ట్రియన్ సెంటర్: దీన్ని1982 లో స్థాపించారు. మధ్య ప్రాచ్యం లోని అతి పెద్ద గుర్రపుస్వారీ కేంద్రం. అరేబియన్ గుర్రాలను కోనుగొలు చేసే కేంద్రాన్ని చూడొచ్చు. గుర్రాల స్వారీ కోర్సులు కూడా ఉన్నాయి. ట్రైనింగ్ పొందిన వారికి, రౌతులకు సర్టిఫికేట్లు ఇస్తారు.
షాపింగ్ సెంటర్: తైఫ్‌లో షాపింగ్ ఆసక్తికరమైంది. పాత షాపింగ్ సెంటర్ సూక్ అల్-బలద్. ఇది పాత నగరమైన తైఫ్‌కు సింహద్వారం. ఇదొక పురాతన సంప్రదాయ బజారుగా చెప్పుకోవచ్చు. ఈ బజారులో హ్యాండిక్రాఫ్ట్స్, స్థానికంగా దొరికే తేనె, సుగంధ ద్రవ్యాలు, నెయ్యి ప్రసిద్ధి చెందినవి. అలాగే వధువుల దుస్తులు ప్రత్యేక ఆకర్షణ. దాంతో పాటు వెండి, బంగారు అల్లికలతో తయారు చేసిన బుర్కాలు లభిస్తాయి. ఇక్కడ సాంప్రదాయ దుస్తులు కూడా విక్రయిస్తారు. ముఖ్యంగా యూరోపీ యులకు ఆకర్షణీయ మైన షాపింగ్ సెంటర్. తాజా పండ్లు కొనడానికి పండ్ల దుకాణం మరో ప్రత్యేక ఆకర్షణ. తైఫ్‌లో దానిమ్మ పండ్లు, ద్రాక్ష, ఖర్జూరం, పుచ్చ కాయలు, బెర్రీలు, ఫిగ్స్ ప్రసిద్ధమైన పండ్లు.
ప్రత్యేక ఆకర్షణ: వందేళ్ల నుంచే గులాబీ పువ్వుల సాగు ఉత్పత్తి లో తైఫ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. పర్యాటకుల కోసం రోడ్ల వెంబడి బారులు తీరి కార్క్ పెట్టెలలో గులాబీ పూలను అమ్ముతుంటారు. గులాబీ అత్తరు, గులాబీ నీళ్ల ఉత్పత్తి ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఇక్కడి మునిసిపాలిటీ, సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ అంటిక్యుటిస్ విభాగం వారు 'రోజ్ ఫెస్టివల్' ను ప్రతి సంవత్సరం జరుపుతుంటారు. దీన్ని చూడడానికి జాతీయ, అంతర్జాతీయ సందర్శకులు వస్తుం టారు. తైఫ్ లో ఉన్న చల్లని ప్రదేశాలైన అల్-హద, అల్-షఫా, అల్-గదీర్ ప్రాంతాలలో గులాబీ తోటలను సాగు చేస్తారు. దాదాపు 233 మిలియన్లు (2 కోట్ల 33 లక్షలు) గులాబీ పూలు. ఇక్కడ ఉన్న 34 ఫ్యాక్టరీలలో 19,000 సీసాల గులాబీ అత్తరును తయారు చేస్తారు. గులాబీలలో చెప్పుకోదగ్గ సీరియన్ జ్యూరీ గులాబీ సైజ్‌లో పెద్దదిగాను సుందరంగాను ఉన్నప్పటికి తైఫ్ గులాబి పూవు ముందు దిగదుడుపే!
వాతావరణం: తైఫ్ సందర్శించడానికి ఉత్తమ సమయం ఏప్రిల్ చివరి వారం నుంచి అక్టోబరు మొదటి వారం. సెప్టెంబర్ అతి తేమ గల నెల. అత్యంత శీతల నెల జనవరి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చల్లని రోజులు. కనీస 'ఉష్ణోగ్రత 49 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 71 డిగ్రీలు'. అప్పడప్పుడు వర్షం, మంచు కురుస్తుంటాయి! ఇస్లామ్ కు పూర్వం ఆరవ శతాబ్దిలో తాయఫ్ మత సంబంధమైన కేంద్రంగా విరాజిల్లింది. ఇక్కడ 'తాయఫ్ స్త్రీ' (లేడి ఆఫ్ తాయఫ్) 'అల్లత్' అనే దేవత ఉండేది. ఈ నగరానికి 'ది గార్డెన్ ఆఫ్ హెజాజ్', ' హెజాజ్ వనం' అని కూడా స్మరించుకొంటారు. తైఫ్ విమానాశ్రం నుంచి 15 నిమిషాల ప్రయాణంలో ఇంటర్ కాంటినెంటల్ హోటల్ కు చేరుకోవచ్చు. ఇక్కడ రాజకుటుంబీకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బస చేస్తుంటారు, ఈ హోటల్ ను 1978 లో నిర్మించారు.
- అమ్జద్
Authorization