పట్టుదల ఉండాలే కాని మహిళలు సాధించలేనిది అంటూ ఏదీ ఉండదు ఈ ప్రపంచంలో. ప్రపంచాన్ని చుట్టిన వారు మహిళా పర్యాటకలు చాలామంది వున్నారు. 27 ఏండ్ల కాసీ డీ పీకోల్ గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుని బద్దలు కొట్టింది. 2015 జులై 24 న మొదలు పెట్టిన తన ప్రపంచ యాత్రను 2017 ఫిబ్రవరి 2 వరకు ముగించింది. మన దేశంలో విభ అనే ఆవిడ ఒంటరిగా 80 దేశాలు చుట్టి వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉంటారు. నా ప్రయాణంలో పరిచయమైన కొంతమంది మహిళా పర్యాటకులతో నాలో దాచుకున్న కొన్ని మధురమైన అనుభవాలు ''అంతర్జాతీయ మహిళ దినోత్సవం'' సందర్భంగా మీ కోసం...
కెనడాలో : ఇక నా అనుభవాల విషయానికొస్తే కెనడా లోని వియా ట్రైయిన్‌లో ఉదయం ఐదు గంటలకు 84 ఏండ్ల ముసలావిడ కలిశారు. ఆమెతో మాట్లాడాను. ట్రైయిన్ ఐదు గంటలకి ఉంటే మీరు ఇంత త్వరగా ఎందుకొచ్చారని అడిగితే ఇది నా జీవిత కల. వియా ట్రైయిన్‌లో ప్రయాణం చేయాలని ఎప్పడినుంచో కలగ న్నాను. ఇప్పుడు నేరవేరింది. అందుకే గంట ముందే స్టేషన్ కు వచ్చి కూర్చున్నాను అని తెలిపింది. అంత పెద్ద ముసలావిడ ఇంత ఉత్సాహంగా మాట్లాడుతుంటే ఆ... అని నోరు తెరిచాను. పిచ్చి చలి. ఆ చలిలో వణుకుతూ ఒక కాఫీ తాగుతూ నాలుగు గంటలు ఒక్కతే స్టేషన్లో గడిపింది. పర్యటనలకు, కోరికలకు వయసుతో సంబంధం లేదని ఆ క్షణం మనసులో అనుకున్నాను. ఇదొక మధురమైన అనుభవం.
ఐలాండ్‌లో : బోనీ రోజారియో అనే మహిళ గల్లపాగోస్ ఐలాండ్‌లో కలిశారు. తన ప్రయాణానికి అడ్డుగా వస్తుందేమోనని పెండ్లి కూడ చేసుకోలేదు. బోనీ రోజారియో ఐలాండ్ ద్వీపములో నెల రోజుల పాటు పేయింగ్ గెస్ట్లాగ రూమ్ తీసుకొని ఉంది. రోజుకి పది డాలర్లు అంటే ఆశ్చర్యపోయాను. సరే మీ రూమ్ చూడాలని అని అంటే తీసుకొని వెళ్ళింది. రూమ్‌లో టీవీ ముందు ఒక టేబుల్, బాత్ రూమ్ ఉంది. మరొక విషయం అక్కడికి వచ్చే స్పానిష్ యాత్రికులకు గైడ్లాగ ఆ నెల రోజులు పని చేసింది. ఇంగ్లీషు వచ్చి స్పానిష్ రాని వాళ్ళకి గైడ్లాగ పని చేస్తూ తను చూడదలచుకున్న ప్రదేశాలనన్నిటిని చూస్తుంది. అక్కడ నేను ఉన్నన్ని రోజులు ప్రతిరోజు కలిసేది. ఇప్పటికీ ఫేస్ బుక్‌లో మాట్లాడుతు ఉంటాను. చిలీ నుండి వచ్చిన ఆండ్రే అనే అమ్మాయి కూడ అక్కడే పరిచయం అయింది. తాను స్పానిష్, ఇంగ్లీషు పుస్తకాన్ని ట్రాన్స్‌లేట్ చేస్తుంది. తనకు ఇండియా చూడాలనే కోరికట.
జర్మనీలో : అమెరికా నుండి జర్మనీ వచ్చిన 50 ఏండ్ల మహిళ కలిశారు. తను ప్రతిరోజు రాత్రి హిట్లర్ కి సంబంధించిన సంతతిని, అతని చరిత్రని కనుక్కొనడానికి ఆ కారు డ్రైవర్‌తో వెళ్ళింది. ఏంటి అంత ధైర్యం వాడు చంపేస్తే అంటే నాకు చావంటే భయం లేదు. నేను అలాంటి వాటికి భయ పడను అన్నది. ఆమె ధైర్యసాహసాలకు మెచ్చు కున్నాను.
మొరాకోలో : అలాగే మొరాకోలో ఫ్రాన్స్ నుండి వచ్చిన ఆవిడ ను కలిశాను. బస్‌లో ప్రయాణిస్తుంటే తన వస్తువు ఏదో బస్ కింద పడిపోయింది. తనకు 50 ఏండ్లు ఉంటాయి. కాని చిన్న పిల్లల కిందకు దిగి వెంటనే బస్ కిందకు దూరి ఆ వస్తువు తీస్తుంటే ఆశ్చర్యపోయాను. నేను మొరాకోలో ఏడు రోజులు ఉన్నాను. తన గురించి కాస్త తెలుసుకున్నాను. తాను యోగా టీచర్. ఇండియా అంటే చాలా ఇష్టమని చెప్పారు. ప్రతి సంవత్సరం ఆరు నెలలు ఇండియాలో ఉంటుంది. ఇండియాకు వస్తే గోవాలో ఉంటుంది. హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి కూడా వచ్చారు.
బాంబేలో : బాంబే ఎయిర్ పోర్ట్‌లో ఒక అమ్మాయిని కలిశాను. తాను మారిషస్ నుండి వచ్చింది. ఇండియా చూడటానికి ఒక్కతే! అలాగే ఇండియా నుండి రోమ్‌కి వెళ్తున్న సమయంలో ఎయిర్ పోర్ట్‌లో 40 ఏండ్ల మహిళ పరిచయం అయింది. తనకు ఎయిర్ పోర్ట్‌లో ఇంగ్లీషులో పామ్ నింపడానికి కొంత సహాయం చేశాను. ఫ్లైట్ ఎక్కే వరకు ఆవిడ వాళ్ళ ఇంటికి రమ్మని పిలిచారు. మూడు రోజుల పాటు మా పిల్లలతో కలిసి వారి ఇంట్లో గడిపాం. చిన్న సహాయం, నోటి మాట ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇలా చాలామందిని కలిశాను. ఈ రోజులలో ప్రతి స్త్రీ ఒంటరిగా ఏ ప్రదేశమైనా వెళ్ళగలదని అనడానికి ఎన్నో ఉదాహరణలు తీసుకోవచ్చు. ఇవన్నీ నా జీవితంలో మధురమైన అనుభవాలు.
- నర్మదా రెడ్డి,9849018510
Authorization