రాక్ గార్డెన్ సౌంద్యాన్ని చూస్తే ఎంతటివారైనా ఆశ్చర్యపోక తప్పదు. అంత అద్భుతంగా అనిపిస్తుంటాయి. అందులోని రాళ్ల అందచందాలు. రాక్ గార్డెన్‌ను సందర్శించడానికి పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో మక్కువ చూపుతారు. ఇది కర్నూలుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణం సిమెంటు పరిశ్రమలకు ముఖ్య కేంద్రం. దీని విస్తీర్ణం మొత్తం వెయ్యి ఎకరాలు. ఎర్రమల కొండల వరుసలోని ఒక భాగమే ఓర్వకల్లు. ఈ రాళ్ల గుట్టల్లో లభించే సికా, క్వార్ట్జ్ ఖనిజాలు గాజుల తయారీ పరిశ్రమకు అతి ముఖ్యమైన ముడి సరుకులు పరిశ్రమల వారు ఇక్కడ గనులు స్థాపించాలని ప్రయత్నాలు చేశారు. కానీ అరుదైన ప్రకృతి అందాలు దెబ్బతింటాయన్న ముందు చూపుతో ప్రభుత్వం అంగీకరించలేదు. పర్యాటక శాఖ ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని అభివృద్ధి పరిచింది. అద్భుతమైన ఆవనిలో నీలాకాశం పందిరి కింద చిత్రవిచిత్రాకృతుల్లో ఆ ముదురు ఎరుపు రాళ్ల గుట్టలు, విశాలంగా ఉన్న పలకలు పలకలుగా ఉండే రాళ్లు. రాతి గుండ్లు, మనుషులు లేని మరో గ్రహంలోకి వచ్చామన్న భయం కలుగుతుంది.
ఆ రాళ్ల గుట్టల మధ్యలోని లోయలలో అక్కడక్కడా నీలి జలసరస్సులు. నిశ్చలంగా ఉన్న ఆ నీటిపై ఊగి సలాడుతూ మందంగా కదులుతున్న పడవలు. సందర్శకుల హడావిడి. ఆ రాళ్ల గుట్టల మధ్యన సన్నసన్నని మట్టిరేగే కాలిబాటలు. రాతి గుండ్ల మధ్య అక్కడక్కడా దట్టంగా గుబురుగా పెరిగిన చిట్టిపొట్టి ఆకుపచ్చ ముళ్ల పొదలు. ఆ పొదలకు పూసిన పసుపు రంగు అడవి పువ్వులు, ఒకరి భుజాలపై మరొకరు నిలబడి చేసే గారడిలా రాళ్ల బండల చిత్రవిచిత్ర విన్యాసాలు. ఎటు చూస్తే అటు విస్తరించిన ఆ జేరుగు రంగు రాళ్లకు చూపు తిప్పుకోక తదేకంగా చూస్తుంటే వాటిల్లో మనుషులు, జంతువులు, ముఖాకృతులు, శరీరాకృతులు కనిపిస్తాయి. ఇదే కాదండోరు అక్కడి ప్రత్యేకత ఈ రాక్ గార్డన్లోనే జయంమనదేరా, టక్కరి దొంగ బాహుబలి సినిమాల షఉటింగులు జరిగాయి.
Authorization