ప్రకృతిలో పొదిగిన సుందరసీమ తెన్మెల.. భారత దేశపు తొలి పర్యావరణ కేంద్రంగా గుర్తింపు పొందింది. కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలోని ప్రదేశమిది. తెన్మెల అంటే తేనె గుట్ట అని అర్థం. ఒకప్పుడు ఈ ప్రాంతం తేనెలకు పుట్టిల్లుగా ఉండేది, దీనికితోడు ఈ ప్రదేశం ఔషధమూలికల నిధి. నగరాల రణగొణ ధ్వనులకు చాలా దూరంగా ఉండే తెన్మెల, అరణ్య జీవన సంస్కృతికీ, సమకాలీన జీవన చిత్రానికీ నిలువుటద్దంగా ఉంటుంది. ఇదొక ఎడతెగని ఆకర్షణల జాబితా. ఎంతో శోభాయమానంగా ఉండే ఇక్కడి లోయలు హృదయాల్ని కట్టిపడేస్తాయి. అయితే ఎంతో సువిశాలమైన తెన్మెలను సందర్శకుల సౌకర్యార్థం కల్చర్ జోన్, లీజర్ జోన్, అడ్వెంచర్ జోన్ అంటూ మూడు జోన్ల కింద విభజించారు. ఒక విలక్షణమైన, అరుదైన అనుభూతిని సొంతం చేసుకోవాలనుకుంటే తెన్మెలను సందర్శించాల్సిందే!
గార్గియస్ నేచర్ ట్రేల్ : సుందర దృశ్యాల్ని చూడాలనుకునే ప్రకృతి ప్రియులకు, సాహసోపేత విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి, సంప్రదాయ విలువలకు ప్రాధాన్యతనిచ్చేవారికి తెన్మెలలోని ఈ నేచర్ ట్రేల్ ఊహకు మించిన అనుభూతినిస్తుంది. పర్వత శ్రేణువుల మీదుగా, పచ్చ పచ్చని అరణ్యాల మీదుగా వీచే ఇక్కడి గాలి హృదయాల్ని తన్మయత్వంతో ముంచేస్తుంది. మధ్యమధ్యన ఎదురయ్యే విశ్రాంతి మందిరాలు పర్యాటలకు ఎంతో సౌలభ్యంగా ఉంటాయి.
తెన్మెల పరప్పర్ వంతెన : లీజర్ జోన్లోంచి నడిచి వెళుతున్నప్పుడు తెన్మెల పరప్పర్ వంతెన ఎదురవుతుంది. నీటిపారుదల ప్రాజెక్టులతో పోలిస్తే కేరళ రాష్ట్రంలోనే ఇది రెండవ అతి పెద్ద, అతి పొడవైన వంతెన. షెండుర్ని అటవీ మృగాల ప్రదేశం తె న్మెల ప్రకృతి పర్యాటనలోకెల్లా ఎంతో విశేషమైనది.
ట్రీ హౌజ్ ఆహ్లాదం : వృక్ష శిఖరాన జీవించడం అన్నది మరెప్పుడూ ఊహించి ఉండరు. అదొక మధురమైన అనుభూతినే ఇస్తుంది. చెట్టు కొమ్మమీద ఉండే కుటీరం లాంటి గుహ చూస్తే ఎవరికైనా అందులో కొన్నాళ్లు బసచేస్తే బావుండుననిపిస్తుంది. నిరంతరం చల్లచల్లని గాలులు వీచే ఈ చోట వేలాది పక్షుల గుంపులు వాటి కేరింతల నాదాలు హృదయాన్ని ఊయలలూపుతాయి.
వేలాడే వంతెన : తెన్మెలలో 1877వ ఏట నిర్మితమైన ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇంజినీర్లు సృష్టించిన ఒక అద్భుతం. బ్రిటిష్ ఇంజినీర్ ఆల్బర్ట్ హెన్రీ సారథ్యంలో నిర్మాణమైన ఈ వంతెన 400 అడుగుల పొడవుతో ఉంటుంది. కల్లాడ నది మీద కట్టిన ఈ వంతెనను కలప పలకలను బిగించడం ద్వారా ఏర్పరిచారు. రెండు చివర్లల్లో కేవ లం రెండు స్థంభాలతో ఈ వంతెనను పూర్తి చేశారు.
Authorization