ఒకప్పుడు ట్రావెలింగ్కు వెళ్లాలంటే దుస్తులతో పాటు కెమెరా తీసుకెళ్లేవారు. ఇపుడు కాలం మారింది. టెక్నాలజీతో ట్రావెలింగ్ ముడిపడింది. ఇంతకీ ఆ ట్రావెల్ గాడ్జెట్స్ ఏంటో తెలుసుకుందాం. ట్రావెలింగ్ వెళ్లేవారెవరైనా స్మార్ట్‌ఫోన్ లేకుండా వెళ్లలేని పరిస్థితి. ట్యాబ్లెట్, ల్యాపీ, కిండల్ బుక్ కూడా ట్రావెలింగ్‌లో దగ్గర ఉండేలా చూసుకుంటున్నారు. గాడ్జెట్స్‌ను చార్జింగ్ చేసే పవర్బ్యాంక్స్ను తప్పనిసరిగా తీసుకెళ్తారు. విహారాన్ని, వినోదాన్ని ఎంచక్కా గాడ్జెట్స్ సహాయంతో సోషల్ వెబ్‌సైట్స్‌లో షేర్ చేసుకుని సంతోషపడుతున్న రోజులివి...
బ్లూటూత్ స్పీకర్స్
అవుట్డోర్ అడ్వెంచర్ ట్రిప్స్ వెళ్లినపుడు, హౌటల్రూమ్లో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ హెడ్‌ఫోన్స్ పెట్టుకోవటం కుదురకపోవచ్చు. అలాంటి సమయంలో బ్లూటూత్ స్పీకర్స్ బావుంటాయి. డివూమ్ ఎయిర్బీట్-10 బ్లూటూత్ స్పీకర్స్ నాణ్యంగా ఉంటాయి. దానికి తోడు ఊఫర్ టచ్ కూడా ఉంటుంది.
గాడ్జెట్ బ్యాగ్
గాడ్జెట్స్‌ను ట్రావెలింగ్‌లో నీరు, దుమ్ము, వేడి నుంచి కాపాడుకోవటం కష్టం. సాధారణ బ్యాగ్‌లో ఉంచితే అవి త్వరగా చెడిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఓవర్‌బోర్డ్ ప్రొ-విస్ వాటర్‌ప్రూఫ్ గాడ్జెట్ బ్యాగ్‌ను వాడితే సరిపోతుంది. వీటిలో ఉండే డిఫరెంట్ ర్యాక్స్‌లో ఆయా గాడ్జెట్స్‌ను సర్దితే సరిపోతుంది. ట్రావెలింగ్‌లో వాటర్‌స్పోర్ట్, ఇతర ఔట్‌డోర్ గేమ్స్ ఆడినా ఈ గాడ్జెట్ బ్యాగ్ ఉంటే చింతించాల్సిన అవసరమే ఉండదు.
మొబైల్ మైఫై
ఈ రోజుల్లో డాటా రోమింగ్ అనేది ఖరీదైన వ్యవహారం. అందులోను హౌటల్స్‌కు వెళ్లినప్పుడు మైౖఫై చార్జీలను కూడా వసూలు చేస్తున్నారు. కాబట్టి మీ వెంట మైఫై తీసుకువెళ్లండి. సింగిల్ సిమ్‌ద్వారా ఈ ఇంటర్నెట్ కనెక్షన్ డివైజ్‌ను పొందవచ్చు. జేబులో ఇమిడిపోయే
ఈ వస్తువుతో కనీసం పది డివైజ్‌లకు ఇంటర్నెట్ కనెక్షన్ లభిస్తుంది. ఇందులో ఎల్సీడీ స్క్రీన్‌లో నెట్ తాలూకు వివరాలన్నీ డిస్ప్లే అవుతాయి. ఇంటర్నెట్ సిగల్ ఎలా ఉంది? బ్యాటరీ చార్జింగ్ ఎంత ఉంది? డాటా యూసేజ్ ఎంత జరిగింది? వంటివన్నీ సులువుగా తెలుస్తాయి. డివైజ్‌లో ఉన్న మరొక అదనపు సదుపాయం - 35 జీబీ మెమోరీకార్డు. మనకు అవసరమైన డాటాను ఇందులో సేవ్ చేసుకోవచ్చు.
వాటర్‌ప్రూఫ్ కేస్
ఐఫోన్ వినియోగదారులకోసం రూపొందించిన వాటర్‌ప్రూఫ్ కేస్ ఇది. సోనీ ఎక్స్‌పీరియా జడ్4, సామ్సంగ్ గెలాక్సీ ఎస్6 స్మార్ట్‌ఫోన్స్ వాటర్‌ప్రూఫ్ కాబట్టి ఆ ఫోన్స్ వాడేవారికి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే ఐఫోన్ వాడేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. వర్షంలో తడిసినా, నీళ్లలో పొరబాటున పడిపోయినా ఇబ్బందే. అందుకే ట్రావెలింగ్‌లో ఐఫోన్, ఐప్యాడ్లు పాడవ్వకుండా ఉండాలంటే మాత్రం ఓవర్‌బోర్డ్ వాటర్‌ప్రూఫ్ కేస్లు వాడితే సరిపోతుంది.
హెడ్‌ఫోన్స్
ట్రావెలింగ్ సాఫీగా, హాయిగా సాగాలంటే ప్లాన్ట్రోనిక్స్ హెడ్‌ఫోన్స్ ఉండాల్సిందే. ఈ వైర్లెస్ హెడ్‌ఫోన్స్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 18 గంటలపాటు వాడుకోవచ్చు. ఈ హెడ్‌ఫోన్స్ స్లీప్‌మోడ్‌లోకి త్వరగా తీసుకొస్తాయి. బయటి శబ్దాలను వినిపించకుండా చేస్తాయి.
Authorization