సౌదీ అరేబియా వెళ్లాలంటే అందరికీ కుదిరేది కాదు. అక్కడికి పనిచేయడానికి వెళ్లే ఉద్యోగులు, కార్మికులు, మక్కా మదీనా పుణ్యక్షేత్రాలను దర్శించే ముస్లిం మతస్థులకు మాత్రమే వీసాలు మంజూరు చేసేది సౌదీ ప్రభుత్వం. అందుకే ఆ దేశం కూడా తన నిబంధనలను సడలించింది. కింగ్డమ్ టవర్, రాయల్ ఎయిర్‌ఫోర్స్ మ్యూజియం... ఆ దేశంలో చూడటానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. సంగీత విభావరులు, రేసింగ్, ఫుట్‌బాల్ లాంటి క్రీడా వేడుకలకు హాజరయ్యే అభిమానుల కోసం తొలిసారిగా ప్రత్యేకంగా ఈ-వీసా జారీ చేయనుంది సౌదీ ప్రభుత్వం. దీని పేరు 'షరెక్'. సాంస్కతిక, పర్యాటక రంగాల్లో ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ఈ-వీసా ఉపయోగపడుతుందని సౌదీ భావిస్తుంది. ఈ వీసాతో సౌదీలో ఎక్కడికైనా వెళ్లే అనుమతి ఉంటుంది. ఎలాంటి నిబంధనలూ ఉండవు. దీని ఖరీదు 170 డాలర్లు ( సుమారు రూ. 13 వేలు). దీనికి కోసం ఎంబసీల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఆన్లైన్లో మీ వ్యక్తిగత వివరాలు, పాస్‌పోర్టు కాపీని, పాస్‌పోర్టు ఫొటోను విదేశీ వ్యవహారాల శాఖ వెబ్సైట్లోకి వెళ్లి అప్లోడ్ చేసి, ఈ-వీసా రుసుము చెల్లిస్తే చాలు. అన్ని వివరాలు పరిశీలించి, ఈ-వీసాను మీ మెయిల్‌కి పంపిస్తారు.
Authorization