చల్లని ప్రదేశాలకు పారిపోయి మంచులో మునకలేద్దాం! మంచులో తడవటానికి అనువైన టూరిస్ట్ డెస్టినేషన్... ది ల్యాండ్ ఆఫ్ స్నోస్ 'హిమాచల్‌ప్రదేశ్'. హిల్ స్టేషన్లు, ఎత్తయిన పర్వతాలు, పచ్చని లోయలు, యాపిల్ తోటలు... ఇలా చూడదగిన ప్రదేశాలకు ఈ రాష్ట్రంలో కొదవే లేదు. ఈ అందాలను చూడాలంటే ఇవిగో ఈ ప్రాంతాలను దర్శించాలి.
హిమాచల్‌ప్రదేశ్ మొత్తంలో మరెక్కడా కురవనంత మంచు కుఫ్రిలో కురుస్తుంది. జనవరి నుంచి మార్చి వరకు ఇక్కడ విపరీతంగా మంచు కురుస్తుంది. కాబట్టి అంత తీవ్రతను తట్టుకోలేని మనకు కుఫ్రి సందర్శించటానికి అనువైన సమయం అక్టోబర్, నవంబర్ నెలలే! సముద్ర మట్టానికి 7,500 అడుగుల ఎత్తున్న కుఫ్రి హిల్ స్టేషన్ సిమ్లా నుంచి 25 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ ప్రతి ఫిబ్రవరిలో స్పోర్ట్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ పోటీల్లో స్కీయింగ్ కాంపిటీషన్ ప్రధాన అట్రాక్షన్. ఇక స్లెడ్ మీద జారే 'టొబొగ్గానింగ్' క్రీడ సంవత్సరమంతా ఆడొచ్చు. కుఫ్రిలో ఇందుకోసం ఓల్డెస్ట్ స్కీయింగ్ స్లోప్ ఉంది. కుఫ్రిలోని గో కార్టింగ్ సర్క్యూట్లో స్కీయింగ్ చేస్తూ ప్రావీణ్యాన్నంతా ప్రదర్శించవచ్చు. మీరు జంతు ప్రేమికులైతే కుఫ్రి ఊరి బయటున్న హిమాలయన్ నేచర్ పార్క్, కుఫ్రి జూలను సందర్శించడం మర్చిపోవద్దు.
కుఫ్రిలో అత్యంత చల్లని ప్రదేశం ఫగు. ఇది హయ్యెస్ట్ పాయింట్ కాబట్టి ఇక్కడ మండు వేసవిలో కూడా గడ్డకట్టే చలి ఉంటుంది. వాకింగ్, ట్రెక్కింగ్‌లకు వీలున్న ప్రదేశం. ఇక్కడి మహసు పీక్ ప్రాచుర్యం పొందిన స్కీయింగ్ పాయింట్. ఇక కుఫ్రి జూ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎలుగుబంట్లు, నక్కలు, చిరుతలు, హిమాచల్ రాష్ట్ర పక్షి హిమాలయన్ మోనాల్లను చూడాలంటే ఈ జూకి వెళ్లాలి. అంతరించిపోతున్న జంతుజాలాన్ని కూడా ఈ జూ పరిరక్షిస్తోంది. కాబట్టి ఆ అరుదైన జంతువుల్ని కూడా ఇక్కడ చూడొచ్చు. అలాగే హిప్ హిప్ హుర్రే అమ్యూజ్మెంట్ పార్కు కూడా చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ రియాలిటీ గేమ్స్, థ్రిల్లింగ్ రైడ్స్లాంటి యాక్టివిటీల్లో పాల్గొనాలనుకునే వారు ఈ పార్క్‌కు వెళ్లాలి. సాహసాలు ఇష్టపడేవాళ్లు ఇక్కడ రాక్ క్లయింబింగ్, కమాండో నెట్, ఫ్లయింగ్ ఫాక్స్, బర్మా బ్రిడ్జ్ యాక్టివిటీలను హుషారుగా ఎంజారు చేయొచ్చు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఎనిమిది వరకూ తెరచి ఉంటుంది. ఇంకా ప్రకతి ఒడిలో పరవశించాలనుకుంటే మషోబ్రా చేరుకోవాలి. ఈ ప్రదేశం ఎత్తయిన వృక్షాలు, పూలు, పళ్ల చెట్లతో నిండి ఉంటుంది. యాపిల్స్ కూడా ఇక్కడే ఎక్కువగా పండుతాయి. ఈ ఊళ్లోని ఇళ్లకు కూడా పూలు, పండ్ల పేర్లే ఉంటాయి. ఇక్కడ బోటింగ్, హార్స్ రైడింగ్ చేయొచ్చు.
అకామడేషన్ గురించి పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక్కడకు దగ్గర్లో రిసార్ట్స్‌తోపాటు బడ్జెట్ హోటల్స్ ఉంటాయి. ఎక్కడ చూసిన మంచు పర్వతాలతో కూడిన అద్భుతమైన దశ్యాలు పనోరమిక్ వ్యూలో కనిపిస్తాయి. ఈ హోటళ్లన్నీ మెయిన్ బజార్ చుట్టుపక్కలే ఉంటాయి. కుల్ఫి ఫాగ్ రోడ్, చెయిన్ రోడ్లలో రిసార్ట్స్ ఉంటాయి. ఇక ఇక్కడి మెయిన్ బజార్‌కు రెండు వైపులా లోకల్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. వీటిలో పరోటాలు, పకోడీలు, చాట్, నూడుల్స్ లాంటి ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. ఇక రెస్టారెంట్లలో ఇండియన్, చైనీస్, కాంటినెంటల్, ఇటాలియన్ డెలికసీస్ దొరుకుతాయి. కుఫ్రి చుట్టు పక్కలున్న టూరిస్ట్ ప్రదేశాల్లో బోలెడన్ని బడ్జెట్ హోటళ్లుంటాయి.
Authorization