విహారయాత్రలకు అనువైన సమయం ఒకటి వానకామైతే రెండోది చలికాలం..! అలాగని వానలు కురిసే ప్రదేశాలకు, మంచు కురిసే ప్రాంతాలకు వెళ్తే ఏం బాగుంటుంది? చిత్తడికి, పొగమంచుకు దూరంగా ఏదైనా పొడి ప్రదేశాలు చుట్టొస్తే కొత్త హుషారొస్తుంది. కాబట్టి చలికి దూరంగా వెచ్చ వెచ్చగా ఉండే ప్రదేశాలకు వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటే టూర్ మొత్తం ఆనందంగా ఉంటుంది.
జన్స్కార్ వ్యాలీ : జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలోని మారుమూల ప్రాంతం జన్స్కార్ వ్యాలీ. ఓ మూలకు విసిరేసినట్టుండే ఈ లోయ అందాలను చూడటం ఓ ఎత్తయితే కార్గిల్ నుంచి ఈ లోయకు చేరుకోవటానికి చేసే ప్రయాణం మరో ఎత్తు. జన్స్కార్ హెడ్ క్వార్టర్స్ పదుమ్. ఇక్కడికి చేరుకోవాలంటే కార్గిల్ నుంచి 250 కి.మీ. ప్రయాణించాలి. జన్స్కార్ మరోపేరు 'ఎండ్ ఆఫ్ ది రోడ్'. ఈ ప్రాంతానికి కార్గిల్ నుంచి సాగే ఒకే ఒక రోడ్డు మార్గం జన్స్కార్లో ముగుస్తుంది. ఇక ఇక్కడి నుంచి ఇతర గ్రామాలకు చేరుకోవాలంటే ట్రెక్కింగ్ చేయాల్సిందే.
సురు వ్యాలీ : కార్గిల్‌కు జన్స్కార్కు మధ్యలో ఉండే లోయ ప్రాంతం సురు వ్యాలీ. సముద్రమట్టానికి 3,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ లోయలో సురు నది సంవత్సరం పొడవునా ప్రవహిస్తూనే ఉంటుంది కాబట్టి ఈ లోయ మొత్తం పచ్చదనంతో నిండి ఉంటుంది. ఈ నది అవతలవైపున్న 'సంకూ, కనిఖర్, టంగోల్, పర్కాచిక్' గ్రామాలు చేరుకోవటానికి రోడ్డు మార్గంతోపాటు అక్కడక్కడా చిన్న చెక్క వంతెనలు కూడా ఉంటాయి. అడుగున నది ప్రవహిస్తుండగా ఈ వంతెనలు దాటడం జీవితంలో మర్చిపోలేని అనుభవం. సురు వ్యాలీకి ఉన్న మరో అట్రాక్షన్ నున్, కున్ అనే రెండు పర్వతాలు. మంచుతో నిండిన ఈ పర్వతాలు వ్యాలీలోని ప్రతి ఊరునుంచి కనిపిస్తూనే ఉంటాయి. ఊళ్లలో చివరిది పర్కాచిక్. అక్కడ ఉండాలనుకుంటే జమ్మూకశ్మీర్ టూరిజం డిపార్ట్మెంట్కు చెందిన ట్రెక్కర్స్ కాటేజిలో ఉండొచ్చు.
ఇలా చేరుకోవాలి : హైదరాబాద్ నుంచైతే శ్రీనగర్‌కు విమానంలో వెళ్లి అక్కడి నుంచి కార్గిల్ చేరుకోవాలి. కార్గిల్ నుంచి క్యాబ్ లేదా బస్ ద్వారా జన్స్కార్ చేరుకోవచ్చు. ప్రయాణ ఖర్చు 9,000. విశాఖపట్నం నుంచైతే లెV్‌ా లేదా శ్రీనగర్‌కు ఫ్లయిట్లో వెళ్లి అక్కడినుంచి కార్గిల్ వెళ్లొచ్చు. ప్రయాణ ఖర్చు పదివేలు.
Authorization