యాంబు సౌది అరేబియాలోని పవిత్ర క్షేత్రమైన మదినాకు పశ్చిమాన ఉన్న నగరం. ఇది ఎర్ర సముద్రానికి ఆనుకొని ఉన్న ఒక అతి ముఖ్యమైన పేరు ప్రఖ్యాతులుగాంచిన ఓడరేవు. యాంబు జిద్దా నుంచి 350 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ విభిన్న దేశాల పౌరులు నివసిస్తున్నారు, ముఖ్యంగా ఆసియన్లు, యూరప్‌లు మధ్య ప్రాచ్యానికి చెందినవారు. యాంబు 2500 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్న అతి పురాతన నగరం.
చూడదగిన పర్యాటక ప్రదేశాలు...
యాంబు సముద్ర తీరాలు: ఇక్కడి సముద్రతీరాలను చూసి ఆశ్చర్యపోవడమేగాక, పరిశుభ్రమైన, లోతైన నీటి కింద రకరకాల జీవ జంతువులను డ్రైవింగ్ ద్వారా చూసి అబ్బుర పడిపోతారు. ఎర్ర సముద్రంలోఎన్నో రకాల చేపలు, విభిన్న పరిమాణాలు గల జీవులున్నాయి. రాళ్ళు, పగడపు దిబ్బలు నీటి అడుగున కలిగిన అనుభవం ఆనందదాయకం.
షర్మ్ యాంబు: ఇది ఉత్తరాన ఉన్న తీరప్రాంత నగరం. ఇక్కడ విస్తారమైన రిసార్ట్స్, డ్రైవింగ్, సఫారి, పడవ క్రీడలు, యాచింగ్ల లభ్యత కారణంగా సందర్శించడానికి ఇష్టపడతారు.
అల్-సువాక్ విలేజ్: యాంబులో మరొక అందమైన గ్రామం. ఇది వాణిజ్య, తీర్ధ యాత్రికులు కలుసుకునే ప్రాంతం. ఈ యాత్రికులు సాధారణంగా సముద్రం లేదా భూమి మార్గాల ద్వారా వస్తారు. అల్ సువాయిక్ గ్రామం ''సోమవారం మార్కెట్'' గా పిలుస్తారు. ఆ రోజు కొనుగోలు దారుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. పక్క నున్న గ్రామాల నుంచి బద్దువులు (పల్లెటూరి సౌదీలు) కూడా తమకవసరమైన సామాగ్రి తీసుకోవడానికి వస్తారు.
ఇండిస్టియల్ యాంబు: ఇది మొదట కేవలం ఒక ఓడరేవు మాత్రమే. కానీ 1975 లో ప్రభుత్వం ఇక్కడ ఒక పారిశ్రామిక ప్రక్రియను ప్రారంభించింది. ఇది ప్రస్తుతం దేశంలో అతి ముఖ్యమైన పారిశ్రామిక స్థావరంగా పనిచేస్తుంది. పారిశ్రామిక యంబు సందర్శకులకు ఒక విలువైన నగరం. ఇక్కడ గొప్ప వాస్తుశిల్పులు రూపొందించిన ఇళ్ళు ఉన్నాయి.
ముస్మాక్ మారిటైమ్ హాల్: ఇది ఒక సాధారణ హాల్ మాత్రమే కాదు. సముద్రపు దశ్యాన్ని అనుభవించే ఒక హాల్. ఈ హాల్లో ప్రధాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రదర్శనలు, సదస్సులు, సమావేశం వంటివి నిర్వహిస్తారు.
ఫ్లవర్ ఫెస్టివల్: సాధారణంగా మార్చి నెలలో లేదా వసంత ఋతువులో యాంబు నగరంలో ఫ్లవర్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇది ''అతిపెద్ద పువ్వుల కార్పెట్ '' గా ప్రపంచ రికార్డును కలిగి ఉంది. సాధారణంగా పువ్వులు సౌదీ అరేబియాలో దొరకటం కష్టం, కానీ ప్రతి సంవత్సరం సౌదీలు వసంత ఉత్సవాన్ని యాంబులో వార్షిక ఉత్సవ పండుగగా జరుపుకుంటారు. కొన్ని లక్షల పూవులను సేకరించి కనులవిందువుగా వివిధ రీతిలో అలంకరిస్తారు. ఈ దశ్యాన్ని తిలకించడానికి స్థానీకులే గాక విదేశీయులు కూడా వస్తారు.
యాంబు డైవింగ్: యాంబులో డైవింగ్ 1,930 కిలోమీటర్ల దూరం వరకు చేయవచ్చు! పగడపు దిబ్బలు తిలకిస్తూ, సముద్రంలో ఇదో సాహస యాత్ర!
Authorization