మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న వింతలూ, విశేషాలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటారు. టూర్కు బయలుదేరే సమయానికి ఏది అందుబాటులో ఉందో తెలిస్తే... మీ సమయం, డబ్బు రెండూ వృథా కావు. దీని కోసం మీ ఫోన్లో 'క్లూక్' యాప్ ఉండాల్సిందే. ఉదాహరణకు మీరు హైదరాబాద్లోని రామోజీఫిలింసిటీ, సాలార్జంగ్ మ్యూజియంలను చూడాలనుకుంటే ఈ యాప్నుంచే నేరుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 'పర్యాటక స్థలాలు, ప్రత్యేక షోలు, బెస్ట్ ఫుడ్స్ అండ్ మస్ట్ ఈట్స్'... ఇలా విభాగాల వారీగా ప్రాంతాలను ఈ యాప్లో విభజించారు. అంతేకాదు, అసలు మీరు టూర్కు వెళ్లే సమయానికి ఫలానా ప్రదేశంలో ప్రవేశం ఉంటుందో లేదో కూడా ఇది చెప్పేస్తుంది. విదేశాలకు వెళ్లినప్పుడు కూడా అక్కడి టికెట్లను మన కరెన్సీలోనే బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. సరసమైన ధరలకు హౌటల్ గదులను కూడా పొందవచ్చు. గూగుల్, ఐఓఎస్ వినియోగదారులకు ఈ యాప్ అందుబాటులో ఉంది.