మలయత్తూర్... ఇది అలువ తాలూకాలోని ఒక గ్రామం. కొచ్చికి 47కి.మీ దూరంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం. కచ్చితంగా చెప్పాలంటే ఎర్నాకులం జిల్లా నార్త్ ఈస్ట్ ఆంగమలికి 16కి.మీ దూరంలో ఉంది. అందమైన కొండలు, గలగలమంటూ ప్రవహించే నది, సుందరమైన ప్రదేశాల కలయికే మలయత్తూర్.
ఇక్కడ సెయింట్ థామస్ చర్చి అత్యంత ప్రసిద్ది చెందినది. అంతే కాక మరో రెండు చర్చిలు కూడా ఉన్నాయి. వీటిని చర్చి ఆఫ్ మేరీ ఇమ్మాక్యులేట్, సెయింట్ సెబాస్టియన్ చర్చిలని అంటారు. ఇక్కడే దుర్గా దేవి దేవాలయం కూడా ఉంది. మలయత్తూర్కు వచ్చే యాత్రికులు మూలం కుజ్జి, మహాగని తోట్టం ప్రదేశాలు కూడా సందర్శించవచ్చు. ఈ ఆథ్యాత్మిక ప్రదేశంలో అద్భుతమైన రుచులను చవి చూడవచ్చు. అన్ని కాలాల్లోనూ భక్తులు, పర్యాటకులు ఈ చర్చికి వస్తుంటారు. వర్షాకాలంలో మాత్రం అదిక వర్షాల వల్ల సైట్ సీయింగ్‌కు సాద్యపడదు.
జలపాతాల పులకరింతలు
అతిరాప్పిల్లి త్రిస్సూర్ జిల్లా ముకుందాపురం తాలూకాలో ఉంది. అద్భుతమైన జలపాతాలకి, అమోఘమైన వర్షాధార అడవులకి ఇది నెలవు. సమృద్ధిగా కనిపించే జీవ వైవిద్యం ఇక్కడి విశిష్టత. దీన్ని 'సైలెంట్ వ్యాలీ' గా కూడా అభివర్ణిస్తారు. అతిరాప్పిల్లిలో వళచల్, చార్పా జలపాతాలు కూడా ఉన్నాయి. ఇక్కడి జీవావరణ వ్యవస్థ కేరళ రాష్ట్రానికే ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటారు. జంతుజాలంతో విరాజిల్లుతూ ...ఈ ప్రాంతం అత్యంత పచ్చటి ప్రదేశంగా, ఉజ్వలమైన వన్యప్రాణుల తావుగా పేరు గాంచిన పశ్చిమ కనుమల సమీపంలో ఉన్నది. ఈ కనుమలు అతిరాప్పిల్లి వళచల్ ప్రాంతంగా సుపరిచితమైన అడవులకు ప్రసిద్ధిగాంచాయి. వర్షాకాలంలో ప్రధాన నది అయిన చలకుడి, ఇంకా అనేక చిన్న కాలువలు వీక్షకులను ఆకట్టుకుంటాయి. పరిసర ప్రాంతం అంతా జీవ కళ తొణికిసలాడుతూ తన ఉనికి కనుక్కుని పులకరించమంటూ పలకరిస్తూ సందడి చేస్తుంది.
ఇల్లితోడు
ఇది కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని ముంగుజిÛలో ఓ ప్రదేశం. సెప్టెంబరు నుండి మే నెల వరకు ఈ ప్రదేశానికి సందర్శనకు వెళ్ళవచ్చు.ఈ నెలల్లో ఇక్కడ ఆనందంగా గడపడానికి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వారాంతాల్లో అయితే ఓ ప్రశాంతమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇది మలయత్తూర్ నుంచి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోనూ, కొచ్చి నుండి 62 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇల్లితోడుకు ఒక వైపున ఉన్న అద్భుతమైన పెరియార్ నదితో, మరొక వైపున ఎత్తైన పర్వతాలతో అద్భుతమైన ప్రకృతి అందాలతో పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంది.
మలబార్ కేథలిక్ చర్చి
కేరళలోని ఎర్నాకులం జిల్లాలో ప్రసిద్ది చెందిన చర్చిలలో ఇది ఒకటి. మలత్తూర్ కొండపైన ఉన్న చర్చి 'మలయట్టూర్ చర్చి' 609 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రదేశం ఒక అంతర్జాతీయ తీర్థయాత్ర ప్రదేశంగా ప్రసిద్ది చెందినది. కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీని ప్రారంభించిన సెయింట్ థామస్‌కు ఈ పుణ్యక్షేత్రం అంకితం చేయబడింది.
కోడనాండ్ ఎలిఫెంట్ ట్రైనింగ్ సెంటర్
కేరళలో భారీ ఉత్సవాల్లో మీకు ఎక్కువగా కనిపించే జంతువు ఏది? గ్రాండ్ గా అలంకరించిన అతి పెద్ద ఏనుగే కదా? కేరళలో ఏ ఉత్సవం జరిగినా ఏనుగుల ఊరేగింపు లేకుండా ఏ విధమైన ఉత్సవం ఉండదు. అలంకరించిన ఏనుగు లేకపోతే ఆ ఉత్సవం అసంపూర్ణంగా భావిస్తారు. అందుకే కేరళలో ప్రతి ఉత్సవంలో ఏనుగుల ఊరేగింపును గౌరవార్థకంగా, రాజసంగా భావిస్తారు. ఇలా ఉత్సవాల్లో ఊరేగించే ఏనుగులకు కప్రికాడ్కు సమీపంలో ఉండే అభయారణ్యంలో ట్రైనింగ్ ఇస్తుంటారు.
థంబోమోజ్జరు డ్యామ్
అత్యంత ప్రసిద్ది చెందిన బ్రిడ్జ్ ఇది. ఈ ఫూట్ బ్రిడ్జి హ్యాంగ్ బ్రిడ్జ్‌లా ఊహించని విధంగా ఉంటుంది. ఇక్కడి థంబోమోజ్జరు డ్యామ్, రివర్
వ్యూ గార్డెన్, ఎజట్టుముఖం ఎకో విలేజ్, సీతాకోకచిలుక తోట మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఈ వంతెనపై రెండు ప్రధానమైన హాట్ స్పాట్స్ ఉన్నాయి. ఎజ్జుటుక ఎకో విలేజ్ థుంబోమోజ్జరు డ్యామ్ రెండింటి కలయిక .
అభయారణ్యం జూ
అభయారణ్యం జూ పర్యాటకుల సందర్శన ఎక్కువగా ఉండటం వల్ల ఇక్కడ చిన్నజంతు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. కోడనాడ్ మొత్తం ప్రాంతంలో సుమారు 2.5 ఎకరాల స్థలంలో జంతువులు విశ్రాంతి తీసుకోవడానికి ఒక పెద్ద జూను ఎర్పాటు చేశారు. 2010లో 200 ఎకారాల్లో ఏర్పాటు చేసిన ఈ అభయారణ్యం జూను తర్వాత అందులో 100 ఎకరాల స్థలాన్ని ఏనుగుల శిక్షణా శిబిరాల కొరకు అప్పగించారు. అలాగే మినీ జూ, కాప్రికేకాడ్లోని అభయారణ్యంలోకి మార్చబడింది.
సిల్వర్ స్ట్రోమ్ పార్క్
అతిరాప్పిల్లిలో ఉన్న ఈ పార్క్ త్రిశూర్ నుండి 49 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్ రైడ్స్, నీటిలో డ్రైవ్‌కు ప్రసిద్ది చెందినది. నిత్యం పనులతో బిజీగా గడిపే వారు విశ్రాంతి తీసుకోడానికి ఎంతో అనుకూలంగా ఉండే ప్రదేశం ఇది. అలాగే కుటుంబంతో, ఫ్రెండ్స్‌తో గడపడానికి కూడా అనుకూల వాతావరణం ఉంటుంది.
నాగన్చేరి పార్క్
నాగన్చేరి రాజ కుటుంబం గురించి విన్నారా? వారు ఇరింగోల్కు చెందిన భూస్వాములు .పెరుంబవూర్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఈ పార్క్ ఉంది. ఇది చిన్న పిల్లలు ఎంతో ఉత్సాహంగా గడిపేందుకు ఏర్పాటు చేసింది. అలాగే పెద్దలను కూడా ఆకర్షిస్తుంది.
పనియేలి పొరు
ఈ ట్రెక్కింగ్ ప్రదేశాన్ని ఉదయం 4 గంటలకు అలాగే సాయంత్రం 8గంటల సమయంలో సందర్శించవచ్చు. ఇక్కడి నుండి1.5కిలోమీటర్లు ప్రయాణిస్తే పెరియార్ రివర్‌ను చేరుకుంటారు. ఈ డ్యామ్ అతిరాప్పిల్లి నుండి 40 కి. మీ. ల దూరంలో ఉంటుంది. డ్యాం చుట్టూ ఉన్న అడవులు వివిధ జీవ, వృక్ష, జంతు జాలాలకు ఆశ్రయం కల్పిస్తున్నది. డ్యాంలో బోట్ విహారం మరువలేని అనుభూతి.
కేరళ రాష్ట్రంలోని అతిరాప్పిల్లి ఉండే అందమైన ప్రకృతి సౌందర్యం గురించి తెలుసుకున్నారుగా... మరింకెందుకు ఆలస్యం ఈ సారి మీ టూర్ ప్లాన్‌లో సాధ్యమైతే దీన్ని కూడా యాడ్ చేసుకోండి. అక్కడి పచ్చటి సుందర ప్రదేశాలను తనివి తీరా ఆశ్వాదించి రండి...
Authorization