- మౌంట్ టెయిడ్
టెనిరిఫేలోని అత్యంత అద్భుతమైన, ఆకర్షణీయమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ఇది ఓ అగ్నిపర్వతం. 1909 తర్వాతనే ఏర్పడిన పర్వతం ఇది. 3718 మీటర్ల ఎత్తులో ఉండి స్పెయిన్‌లోనే అత్యంత ఎత్తైన పర్వతంగా గుర్తింపు పొందింది. అక్కడి టూరిజం శాఖ వారు పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేందుకు ఎన్నో ఏర్పాట్లను చేశాను. కార్క్ పార్కింగ్ మొదలుకొని అక్కడ ఉండే ప్రతీ ప్రదేశం ఎంతో అందంగా తీర్చి దిద్దారు. ఇక్కడ ఓ అందమైన కేఫ్ కూడా ఉంటుంది. ఇక్కడి నుండి చుట్టు పక్కల ప్రదేశాలను సందర్శించేందుకు కేబుల్ కారు కూడా ఏర్పాటు చేశారు. అందులో కుటుంబ సభ్యులతో కలిసి అన్ని ప్రాంతాలను ఎంచక్కా చూసి రావొచ్చు. ఇక్కడ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది. చారిత్రాత్మకమైన షాపింగ్ మాల్స్ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. కేబుల్ కార్లలో కొండ పైకి వెళుతుంటే ఆ అనుభూతే వేరు. టెనరఫేలోని ఆ సుందరమైన ప్రకృతి సౌందర్యంతో తనువంతా పులకరించి పోతుంది.
- సియామ్ పార్క్
ఉద్యోగంతోటి ఎంతో బిజీ జీవితాలు అనుభవిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి కాసేపు సేద తీరాలనుకుంటున్నారా? అయితే అలా గడిపేందుకు ఎంతో అనుకూలమైన పార్క్. సియాన్ పార్క్ కోస్తా తీరప్రాంతాలోని ఓ వాటర్ వరల్డ్. దీన్ని 2008లో ప్రారంభించారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ఆ సమయంలో పర్యాటకులు తమ కుటుంబ సభ్యులతో అక్కడికి వెళ్ళి ఆనందంగా గడుపుతుంటారు. అంతే కాక ఇక్కడ వినోదాన్ని అందించే ఉద్యానవనాలు, కొలనులు, రెస్టారెంట్లతో నిండి ఉండే ఈ పార్క్‌లో మీ కుటుంబంతో కలిసి వెళితే తప్పకుండా ఎంజారు చేసిరావచ్చు.
- మంకీ జూ పార్క్
ఈ పార్క్ పిల్లలకు ఎంతో సరదాను అందిస్తుంది. ఇక్కడ అంతరించి పోతున్న కోతి జాతుల సంరక్షణకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. మిగిలిన జూ పార్కుల మాదిరిగా బోనుల్లో జంతువులను చూడడం కాకుండా ప్రత్యక్షంగా జంతువులతో గడిపే అవకాశం ఇక్కడ ఉంటుంది. ఈ పార్కులో కేవలం కోతులే కాకుండా రకరకాల జంతువులను కూడా చూడవచ్చు. ఉడతలు, చిలుకలు, గినియా పందుల వంటి అంతరించిపోతున్న జీవాలు ఈ పార్కులో మనకు దర్శనమిస్తాయి. ఇది ప్రతి రోజూ ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు వరకు సందర్శకుల కోసం తెరిచి ఉంచుతారు. జంతు ప్రేమికులకు ఇది ఓ చక్కని ప్రదేశం. పెద్దలకు 10 యూరోస్, పిల్లలకు 5 యూరోస్ ప్రవేశ రుసం ఉంటుంది.
ఆర్ట్ లాండియా డాల్ మ్యూజియం
ఈ ఆర్ట్ లాండియా డాల్ మ్యూజియం టెనెరిఫే లోనే అత్యంత అద్భుతమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులో సుమారు 600 రకాల కళాకృతులను భద్రపరిచారు. పిల్లలు ఎంతో ఇష్టపడే బొమ్మలు, టెడ్డీ బేర్స్ ఈ ఆర్ట్ మ్యూజియంలో ఉన్నాయి. అనేక రకాల బొమ్మలను మ్యూజియం నిర్వాహకులు స్వయంగా ప్రదర్శిస్తుంటారు. ఇక్కడకు వచ్చే కళాకారులలో స్థానికులతో పాటు, అంతర్జాతీయ కళాకారులు కూడా ఉన్నారు. ఈ బొమ్మలను పింగాణి, పల్స్, వినైల్, మైనం, సెరామిక్స్, కలప వంటి వివిధ రకాల పదార్థాలతో తయారు చేస్తారు. ఇక్కడ కేవలం బొమ్మలను చూసి ఆనందించడం మాత్రమే కాదు. వాటి చరిత్రను తెలుసుకోవచ్చు. అలాగే వాటిని తయారు చేసే విధానం కూడా నేర్చుకోవచ్చు. స్పెయిన్ వెళ్ళినప్పుడు ఇంతకంటే చూసేందుకు మరో అద్భుతమై, చారిత్రాత్మకమైన ప్రదేశం ఉండదని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అలాంటి గొప్ప అనుభూతిని మీకు ఈ ఆర్ట్ లాండియా డాల్ మ్యూజియం అందిస్తుంది. ఈ మ్యూజియం కూడా ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతారు. పెద్దలకు 10 యూరన్లు, పిల్లలకు 4.5 యూరన్లు ప్రవేశ రుసం ఉంటుంది. ఆరేండ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ప్రవేశం ఉచితం.
మ్యూజియం ఆఫ్ సైన్స్ అండ్ స్పేస్
చాలా మంది కేవలం ఇది సైన్స్‌కు సంబంధించిన మ్యూజియం మాత్రమే అనుకుంటారు. కానీ ఇది ప్రత్యేకంగా పిల్లలు ఇష్టపడే ఓ అమేంజ్మెంట్ పార్క్ లాంటిది. అందుకే టెనెరిఫేలో ఓ అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా ఇది గుర్తింపు పొందింది. ఇక్కడ సందర్శించిన వారు మనిషి శరీర భాగాల పని చేసే ప్రక్రియను తెలసుకోవడంతో పాటు ఆకాశంలో నక్షత్రాల కదలికల గురించి కూడా తెలుసుకోవచ్చు. ఇంకా ఇక్కడ అనేక రకాల చర్చలు, వర్క్‌షాప్‌లు, డిబేట్స్, ప్లానిటోరియం సెక్షన్లు, తాత్కాలిక ఎగ్జిబిషన్లు ఇలా ఎన్నో ఈ మ్యూజియంలో చూడవచ్చు. ఇది ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటలకు వరకు తెరిచి ఉంటుంది. ప్రవేశ రుసం ఆ రోజు ప్రత్యేకతలు, ఎగ్జిబిషన్ల ఏర్పాటును బట్టి ఉంటుంది. ఏ రోజు ఏలాంటివి ప్రదర్శించబడతాయో వెబ్సైట్లో పొందిపరుస్తారు. వాటిని బట్టే ప్రవేశ రుసం నిర్ణయించబడుతుంది.
- మాయా గ్రామం
ఇది టెనెరిఫే లోనే అత్యంత సంభరాశ్చర్యాలను కలిగించే ప్రదేశం. ఈ ప్రాంతం ఓ అందమైన ప్రయాణ అనుభూతిని మనకు అందిస్తుంది. ఇరుకైన రహదారుల వెంట వీక్షణ ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీన్ని మస్కా గ్రామం అని పిలుస్తారు. మొత్తానికి ఈ గ్రామంలో ప్రయాణం ఓ మాయలా అనిపిస్తుంది. మాంత్రిక వాతావరణం కనిపిస్తుంది. అందుకే దీన్ని మాయా గ్రామం అని అంటారు. ఈ ప్రదేశానికి ఎన్నో సాహస గాధలు కూడా ఉన్నాయి. టెనెరిఫే అందాలు, అద్భుతాలు మనసారా ఆస్వాదించాలంటే ఇక్కడ ప్రయాణం చేయక తప్పదు.
- తబైబా షిప్
తబైబా ఫిప్ అనేది స్కూబ్ డ్రైవింగ్ ఇష్టపడే వారికి అత్యంత ప్రీతి పాత్రమైన ప్రదేశం. మీరు సముద్ర తీరాలను అన్వేషించాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారికి ఇది ఓ చక్కని అన్వేషణా ప్రాంతం. సముద్రంలో శిథిలమైపోయిన ఎన్నింటినో అన్వేషించడం ఇక్కడ ఎంతో సరదాగా ఉంటుంది. అలాగే సముద్ర జీవులైన రకరకాల చేపలు, కారకాడు, ట్రంపెట్ చేపలు, ఆక్టోపస్, మోర్ ఇల్స్ వంటి వివిధ సముద్ర జీవుల్ని చూసే అవకాశం కూడా మీకు దొరుకుతుంది.
- టెనెరిఫే ఆడిటోరియం
ఈ టెనెరిఫే ఆడిటోరియం ఎన్నో వేదికలు కలిగిన సుందరమైన ఆడిటోరియం. ఇది అనేక సంగీత కార్యక్రమాలకు నిలయం. ఈ వేదికలపై ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు నిత్యం జరుగుతుంటాయి. దీన్ని టెనెరఫే లోని ఓ కల్చరల్ హబ్‌గా చెప్పుకోవచ్చు. సాంస్కృతిక ప్రపంచంలో విహరించాలనుకునే వారికి ఇది చక్కని ప్రదేశం.
వేకేషన్కి ప్లాన్ చేసుకునేటప్పుడు అందులోనూ కుటుంబంతో కలిసి వెళ్ళాలనుకున్నప్పుడు అందరి ఇష్టాలు, ఆసక్తులను దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు ఆ ట్రిప్ సంతోషంగా నడుస్తుంది. మీరు పిల్లలతో కలిసి టెనెరిఫే వెళ్ళాలనుకుంటే మాత్రం వీటిని మాత్రం మిస్ కాకుండా చూసుకోండి.
టెనరఫే... ఓ అందమైన ప్రదేశం. ఆహ్లాదమైన బీచ్‌లతో ఎంతో ఆకర్షణీయంగా ఉండే అద్భుతమైన పర్యాటక స్థలం. ఎప్పుడూ స్వదేశంలోనేనా... ఒక్కసారైనా అలా కుటుంబంతో సరదాగా దేశం దాటి విహరించాలి అని అనుకునే వారికి ఇది ఓ సుందర స్వప్నం. స్పెయిన్ దేశంలోనే అతి పెద్ద మంచు ప్రదేశం ఇది. ఇక్కడి అందమైన ప్రదేశాలు అత్యంత ఆహ్లాదాన్ని అందిస్తాయి. అందులోనూ ఎప్పుడూ స్కూలు, పరీక్షలు, మార్కులంటే బిజీగా గడిపే పిల్లలకైతే ఆనందంతో పాటు అందమైన అనూభూతిని మిగుల్చుతాయి. అవేంటో చూద్దాం.
Authorization