- పిల్లలతో ప్రయాణం చేయడానికి ఎంతో ఓపిక ఉండాలి. కొత్త ప్రదేశాలకు తీసుకెళితే అక్కడ వారిని ఆకర్షించేవి ఎన్నో ఉంటాయి. పిల్లలకు ఏదైనా నచ్చితే అంత త్వరగా విడిచిపెట్టరు. వారికి నచ్చిన వాటితో సమయాన్ని గడుపుతున్నప్పుడు పెద్దలు వారిని ఇబ్బంది పెట్టకూడదు.
ష పిల్లలకు కెమెరాలు ఇవ్వండి. చుట్టుపక్కలనున్న ప్రదేశాల్లో వారికి నచ్చినవి అందులో బంధించమని ప్రోత్సహించండి. వారిని ఆకర్షించే వస్తువులపై మీరు ఓ కన్నేయండి.
- వాతావరణపు మార్పులు కచ్చితంగా ఆరోగ్యంపై పడతాయి. అందుకే వాతావరణపు మార్పులు పిల్లల ఆరోగ్యంపై పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో మీ పిల్లలు కొత్త ప్రదేశంలో కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటారు. పిల్లలకు వేసే దుస్తుల విషయంలో అశ్రద్ధ వహించడం మంచిది కాదు.
- నేటి టెక్నాలజీ కాలంలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఎన్నో యాప్లు ఉన్నాయి. మీ మొబైల్లో వాటిని డౌన్ లోడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల పిల్లల కోసం ప్రత్యేకించి బొమ్మలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకవేళ పిల్లలు ఇబ్బంది పెడుతుంటే గేమ్ యాప్ ఓపెన్ చేసి వారి చేతికి ఇచ్చేయండి. లేదా పిల్లలు రంగులు వేసే పుస్తకాలను కూడా మీరు పట్టుకెళ్ళవచ్చు.
- ప్రయాణం చేస్తున్నప్పుడు మీ పిల్లల ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు వచ్చినా వారికి అనారోగ్యం వచ్చిందేమో తెలుసుకోండి. వారు సరిగ్గా తినకపోయినా, సాధారణంగా ఉండకపోయినా ఎందుకు అలా ఉంటున్నారో తెలుసుకోండి. వీలైతే ప్రయాణం ముందు పిల్లల డాక్టర్ని సంప్రదించి వారి కోసం మందులు తీసుకెళ్లండి. ఎందుకైనా మంచిది మీతో పాటు ప్రాధమిక చికిత్సా సామాగ్రి పట్టుకెళ్ళడం మర్చిపోకండి.
Authorization