సౌదీరేబియాకు పశ్చిమ భాగంలో ఉన్న అల్-షిఫా ప్రాంతంలో ఉన్న ఎత్తైన పర్వతం 'జబల్ డక' అరబిక్‌లో జబల్కు అర్ధం పర్వతం. ఇది తైఫ్ పట్టణం నుంచి 20 కి.మీ.ల దూరంలో ఉంది. అల్ షిఫా ప్రాంతంలో టూరిస్ట్ రిసార్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకు పొగమంచుతో కప్పబడి మనోరంజకంగా ఉంటుంది.
శుక్రవారం, శనివారం మాకు వారాంతపు సెలవులుంటాయి కాబట్టి గురువారమే మక్కాలో ఆ రాత్రి విడిది చేసి (75 కి.మీ) తెల్లారుజామున ఐదు గంటలకు డక పర్వతం పర్యటనార్ధం బయలు దేరాం. మక్కా ఔట్ స్కర్ట్ నుంచి తైఫ్ మీదుగా 'అష్-షిఫా' టౌన్ కు చేరుకున్నాం. ఇక్కడ ఓ హోటల్ బుక్ చేసుకొని కొన్ని గంటలు బడలిక తీర్చుకొని ఉదయం పది గంటలకు అల్-షిఫా నుంచి బయలుదేరాం.
నలువైపులా పొగమంచు వ్యాపించి ఉంది. సముద్రమట్టానికి ఆరు వేల ఫీట్ల ఎత్తులో ఉన్నప్పుడు కొన్ని నిమిషాల కోసం అల్-షఫా ప్రాంతంలో అగాము. బ్రేక్ ఫాస్ట్ అక్కడే నిలబడి చేశాం. హాట్ పాట్ లో తెచ్చిన పులిహోరా కొన్ని క్షణాలలోనె చల్లారి పోయింది. ప్లాస్క్‌లో వెంట తెచ్చుకున్న కాఫీ కూడా తాగాం. అది అంతే, అనుకున్నంతా వేడిగా లేదు. ఇక్కడ వ్యాపించిన పొగమంచులో కొంత ఆనందం పొంది ముందుకెళ్లాం. మా అసలు గమ్యమైన 'జబల్(పర్వతం) డకా' వైపు. అక్కడికి చేరుకోవడానికి ఉన్న సింగిల్ లైన్ రహదారి పొగమంచుతో పూర్తిగా కప్పబడి ఉన్నందున వాహనాల రాకపోకలకు చాలా ఇబ్బంది కలిగింది. మా రెండు
వాహనాలను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేసుకొంటూ వెళ్ళాం. పొగ మంచు వల్ల ఏమీ కనిపించడం లేదు. అతి కష్టంగా మా ముందుపెద్దబ్బారు నడుపుతున్న మాజ్డ హాజార్డ్ లైట్ తప్ప ఏమీ కనిపించడం లేదు. దట్టంగా వ్యాపించిన పొగమంచులో ముందుకు వెళ్లడం సురక్షితం కాదనుకున్నాను. నీటి తుంపరలు కారు విండ్ షీట్ పై పడుతున్నాయి. వైపర్ తన పని తాను చేసుకొంటూన్న డ్రైవర్ కు మాత్రం అసౌఖర్యంగానే ఉంది. మా ఇద్దరు అబ్బాయిలు ''ఇంత దూరం వచ్చాం. చలో దేఖేంగే!'' అంటూ కదిలారు. డక పర్వతం దారి పట్టాం. నా శ్రీమతి మాత్రం చాలా ఎక్సైటెడ్‌గా ఉంది. ఇంతలో వెనుక నుంచి ఓ కారు హార్న్ మొగించుకొంటూ హజార్డ్ లైట్లతో పాటు హెడ్ లైట్ తో మంచు పొగలో మాయమైపోయింది. జాగ్రత్తగా బంపర్ టు బంపర్‌తో ముందుకు వెళ్లాం.
అక్కడక్కడ చదనుగా ఉన్న స్థలాలలో పిల్లలు ఆడుకోవడానికి చిన్న విడిదిలా గ్రాస్ లాన్లో కొన్ని ఆటవస్తువులు ఉన్నాయి. అక్కడే ఓ రెండు చోట్ల గుడిసె ఆకారంలో కాంక్రీట్‌తో చేయబడిన గొడుగుల ఆకారాలతో చిన్న ఫ్యామిలీ కూర్చోవడానికి వీలుగా ఉన్నాయి. మా వాహనాల స్పీడ్ గంటకు 10 కిలో మీటర్లతో వెళ్లుతున్నాయి. ఓ చోట నేను కిటికి అద్దం కొద్దిగా కిందికి దించి ''సలాం అలైకుం...యూ ఆర్ ఫ్రం వేర్?'' అని అడిగాను. ''వలెకొంవస్సలం. హం పాకిస్తాన్ సే'' అని అన్నారు. వేరే ఫ్యామిలీ వాళ్లు కూడ స్పందించి ''కేరళ'' అని పెద్దగా చెప్పారు. ఆ పొగమంచులోనే బార్బిక్యూ కుంపటి పై షీష్ కబాబ్ పొగలు వదలకుండా కాలుతుంది. అది కోడిదా, మేకదా మరేదైనదా అన్న విషయం పై చర్చ మొదలెట్టింది నాతో ఉన్న చిన్న కోడలు వాళ్ళ అత్తతో!
మా చిన్నాబ్బాయి డక హైయెస్ట్ పైంట్ కొచ్చాక దీన్ని మౌంటైన్ అని ఎందుకనాలి, హిల్ అని ఎందుకు అనకూడదని ప్రశ్నించాడు. ఈ రెండింటికి సరైన నిర్వచనం నాకు కూడా తెలియదు కాని కొద్దిగా తెలిసిన జ్ఞానం ప్రకారం సముద్ర మట్టం 600 మీటర్లకు పైన ఉన్నవాటిని పర్వతాలని అంటారు. మా పెద్దబ్బాయి వింటూ 'డాడ్... యూ ఎస్ ప్రకారం వెయ్యి ఫిట్స్ లేదా దానికి మించి ఉన్న ఎత్తైన ప్రదేశాన్ని పర్వతం అని అంటారు' అని చెప్పాడు. వెంటనే 'హౌ యూ నో భయ్యా' అని అడిగాడు. ''పీచే దేఖో!'' అని అక్కడున్న టవర్ వైపు చూపాడు. దాన్ని ముప్పావు వంతు పొగమంచు మింగేసింది. నీకెలా తెలుసని మా పెద్ద కోడలడిగింది. అక్కడ చూడు పెద్ద పెద్ద అక్షరాలతో ూుజ (ూaబసఱ ువశ్రీవషశీఎ) అని రాసి ఉంది కదా. ఇది మా విభాగానికే చెందినది. ఇది 15 కి .మీటర్ల వ్యాసంలో కవరేజ్ ఇస్తుంది. హైయెస్ట్ మౌంటెన్ పై దీన్ని ఎరెక్ట్ చేశారని మా అఫిషియల్ రికార్డ్ లో ఉంది.
అక్కడే కొద్దిదూరంలో ఓ చిన్న వాహనాన్ని ఫాస్ట్ ఫుడ్ స్టాల్‌గా మలచాడు ఓ చిన్న వ్యాపారి. కొందరు పర్యాటకులు అక్కడికెళ్లి తమకు కావల్సిన తిను భండారాలు తీసుకొచ్చారు. మా అమ్మాయి, పెద్ద కోడలు అక్కడకు వెళ్లి వేయించిన కంకి, ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొచ్చి మాకందరికిచ్చారు. అవి అరగించాక చిన్న ఫొటొ సెషన్ మొదలైంది. సముద్రమట్టానికి 8200 అడుగులకు పైగా ఎత్తు లో. భయంకరమైన గాలి. ఎముకలు కొరికే చలి. నేను మాత్రం కారులోనే కూర్చున్నాను. పిల్లలుతో పాటు మా మిసెస్ ఫొటోల గొడవలో మునిగిపోయారు. నా కండ్లు కోతులను వెదకసాగాయి. ఎక్కడ కనిపించలేదు. కొన్ని నిమిషాల తర్వాత మా మనువడు ''డాగ్...డాగ్'' అని అరవసాగాడు. నా చూపు కూడా దాని పై పడింది. అది క్షణంలో కనిపించి రాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయింది. నాకు ఆశ్చర్యమేసింది! దీనికేమిటీ పని ఇక్కడీ ఏం తింటుంది ఇక్కడ అంటూ విస్తూబోయాను. ''పదండి రాత్రిమొదలవుతోంది. టెంపెరేచర్ పడిపోతుంది. వెళ్లిపోదాం'' అని అని అరిచాను.
పెద్దాబ్బయి నా దగ్గరకు వచ్చి'' డాడ్ మనం వేరే మార్గం ద్వారా వెల్దాం! ఈ మౌంటెన్ పీక్ నుంచి మన బండ్లు ప్రాకుకొంటూ కరెంట్ బల్బులో వంకర టింకర రోడ్ల పై వెళుతుంటే దేదీప్యమానంగా వెల్గుతూండే తైఫ్ సిటి ని చూస్తూ ఆనందించవచ్చు'' అని అన్నాడు. నేను ఓ కే అంటు మీ స్లిప్ అండ్ స్లోప్ బ్రేకర్స్ సరి చేసుకొండి అని అన్నాను. అల్ హదా ప్రాంతం గుండా జారుకొంటూ వెళ్లాయి మా రెండు కారులు. ఓ చోట ఎత్తైన ప్రదేశంలో ఆగిచూస్తే, తైఫ్ సిటీ విద్యద్దీపాలతో తేలిపోతూన్నట్లు అనిపించింది. కనువిందు చేసే దృశ్యం అది. తైఫ్ చేరుకున్నాక ఓ మసీదు దగ్గర ఆగి ఫ్రెష్ అయి తిరుగు ప్రయాణం జెద్దా కొరకు మొదలైంది.
Authorization