ప్రస్తుతం 3డీ ట్రెండ్ నడుస్తోంది. ముఖ్యంగా చలన చిత్ర రంగంలో ఈ విధానం ఉపయోగించి సినిమా నిర్మించేవారి సంఖ్య పెరుగుతూ ఉంది. 3డీ అనుభూతి మనలను మైమరిపించేస్తుందనడంలో అతిశయోక్తి లేదు. ఈ 3డీ సినిమా నిర్మాణానికి బాటలు పరిచినది 3డీ చిత్రకళ. దీనినే 3డీ పెయింటింగ్ అని కూడా అంటారు. ఈ 3డీ పెయింటింగ్‌కు ప్రత్యేక మ్యూజియం కూడా ఉంది. ఆ మ్యూజియం ఎక్కడ వుందో దాని వివరాలు ఏంటో తెలుసుకుందాం...
- చెన్నై నగరంలోని ఈస్ట్ కోస్ట్ రోడ్డులో దేశంలోనే అతి విశాలమైన 3డీ పెయింటింగ్ మ్యూజియం ఉంది.
- ప్రతి రోజూ వేల మంది సందర్శకులు ఈ మ్యూజియంను సందర్శిస్తూ ఉంటారు.
- ట్రిక్ ఆర్ట్ జాబితాలో 3డీ పెయింటింగ్ మొదటి వరుసలో ఉంటుంది.
- ఈ 3డీ పెయింటింగ్ చిత్రకళకు వేల ఏండ్ల చరిత్ర ఉంది.
- అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ చిత్రకళ నేర్చుకోవడం కొంత కఠినమే అని చెప్పవచ్చు.
- ఈ 3డీ చిత్రకళను సాంకేతికంగా టెంప్లో ఓర్లు అని అంటారు. అంటే కంటిని మోసగించేదని ఫ్రెంచ్ భాషలో అర్థం.
- ఈ కళ ముఖ్య ఉద్దేశం భ్రమను కలిగించి లేనిది ఉన్నట్లు చూపించడం
- ఈ కళను వేల సంవత్సరాల కిందట శత్రు సైనికులను బోల్తా కొట్టించడానికి వినియోగించేవారు.
ముఖ్యంగా గ్రీకులు ఈ చిత్రకళను వినియోగించి చిన్నవిగా ఉన్న కోటలను పెద్దవిగా చూపించి శత్రు సైనికులను బోల్తా కొట్టించేవారని చరిత్ర చెబుతోంది.
- క్లిక్ ఆర్ట్ మ్యూజియం, ఈస్ట్ కోస్ట్ రోడ్డు, అక్కరై, ఇంజంబక్కం, చెన్నైలో ఇలాంటి 3డి మ్యూజియం మిమ్మల్ని ఓ అద్భుత లోకంలోకి తీసుకెళుతుంది. మరెందుకు ఆలస్యం ఈ మ్యూజియంకు వెళ్లి అక్కడ ఉన్న చిత్రవిచిత్రమైన పెయింటింగ్స్‌ను చూసి ఆనందించండి
Authorization