ఎండలు ఎంతగా మండిపోతున్నా కుటుంబంతో కలిసి ట్రిప్పులు వేసే వారు ఎంతో మంది ఉన్నారు. ఎందుకంటే పిల్లలకు సెలవులు దొరికేది ఇప్పుడే. అయితే ఎండల్లో ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. అందుకే వేసవి ప్రయాణంలో తీసుకోవల్సిన కొన్ని జాగ్రత్తలు మీకోసం...
నీళ్లు ఎక్కువ తాగండి: ప్రయాణంలో ఉన్నప్పుడు నీళ్ళను నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే ప్రయాణపు అలసటని దూరం చేయడంలో నీళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా నీళ్లు శరీరాన్ని వాతావరణ మార్పులు తట్టుకునేలా చేస్తాయి.
ఆహారం: ప్రయాణల్లో చిరుతిండ్లపైకి మనసు వెళ్లడం సహజం. అయితే ప్రయాణంలో చిరు తిండ్లు కాకుండా మంచి ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పుచ్చకాయ, కీరా వంటివి శరీరంలో నీటి శాతం ఉండేలా చేస్తాయి. అలాగే శరీరాన్ని చల్లబర్చడంలో కూడా బాగా పనిచేస్తాయి. కమలాపండ్లు వేసవిలో ప్రయాణిస్తున్నప్పుడు దగ్గర ఉంచుకోవడం మంచిది.
చర్మ సంరక్షణ: ఎండ చర్మంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో తెలిసిందే. సెలవుల్లో అయినవారితో ఎంతో సంతోషంగా గడుపుతున్నప్పుడు చర్మం పాడైతే అసౌకర్యంగా, బాధగా ఉంటుంది. అందుకే ఎండలో వెళ్లే ముందు చర్మానికి సన్ స్క్రీన్ అప్లై చేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు.
విశ్రాంతి: వేసవిలో సెలవులలో ప్రయాణం చేయడానికి ముఖ్య ఉద్దేశం శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి. ఎలాగైతే శరీరానికి విశ్రాంతి కలిగిస్తున్నామో మనసుకు కూడా విశ్రాంతి ఇవ్వాలి. అంటే సెలవులప్పుడు కూడా మొబైల్లోనో, లాప్ టాప్ లోనో సమయం కేటాయించడం సరికాదు. వీటికి బదులు ఓ అందమైన బీచ్ దగ్గర మ్యూజిక్ వింటూనో, అలలను చూస్తూ నచ్చిన పుస్తకం చదువుతూనో గడిపితే ఆ అనుభూతే వేరు.
తగినంత నిద్ర: పని ఒత్తిడితో నిద్ర సరిగ్గా పట్టవచ్చు, పట్టకపోవచ్చు. అందుకే సెలవుల్లో ఉన్నప్పుడే బాగా నిద్రపోవడానికి సమయం కేటాయించుకోండి. శరీరం అలసటగా ఉన్నప్పుడు కొత్త ప్రదేశాలల్లోని వింతల్ని, విశేషాల్ని ఎంజారు చేయడం కష్టం. అలసటగా ప్రయాణించడం వల్ల ఎటువంటి ఆనందం ఉండదు. అందుకే అలసిపోయినప్పుడు బాగా నిద్రపోయి శరీరానికి తగిన విశ్రాంతి ఇచ్చి ఆ తర్వాత మీకు నచ్చిన ప్రదేశాలు చూసేందుకు వెళ్ళండి.
Authorization