మిక్సీ, అవెన్, ఫ్రిజ్ ... వంటి ఎలక్ట్రా నిక్ వస్తువులపై భాగం జిడ్డుగా మారు తుంటుంది. ఇలాంటప్పుడు 4 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో టేబుల్ స్పూన్ వెచ్చని నీళ్లు కలిపి స్పాంజ్‌తో ముంచి, పిండి తుడవాలి. మురికి సులువుగా వదిలిపోతుంది.- షూస్, స్నీకర్స్ లోపలివైపు దుర్వాసన వస్తుంటుంది. కొద్దిగా బేకింగ్ సోడా లోపలివైపు చల్లి, తడి క్లాత్‌తో తుడిస్తే దుర్వాసన రాదు.- చెక్క ఫర్నీచర్ మీద మరకలు తొలగించాలంటే టూత్‌పేస్ట్ రాసి తర్వాత తడి క్లాత్‌తో తుడవాలి.- పిల్లలు కలర్ పెన్సిళ్లతో గోడల మీద బొమ్మలు వేస్తుంటారు. ఈ మరకలు తొలగించాలంటే బేకింగ్ సోడా చల్లి, తరువాత స్పాంజ్‌తో తుడవాలి.- నీళ్లలో కప్పు అమ్మోనియా కలిపి మెత్తని టర్కీ టవల్స్‌ను నానబెట్టాలి. అరగంట తర్వాత ఉతికితే మురికిపోతుంది. వేడినీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం, చెంచా వంటసోడా, చిటికెడు ఉప్పువేసి వాటర్ బాటిల్స్‌ను రెండు రోజులకొకసారి శుభ్రపరిస్తే బాక్టీరియా దరిచేరదు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు