తెల్లని మంచు దుప్పటి పరచుకున్న హిమగిరులు.. నీలి రంగు సింగారించుకున్న అందమైన సరస్సులతో మనసు దోచే రాష్ట్రం సిక్కిం. 1975 వరకు సిక్కిం చోగ్యాల్ రాజ వంశీకుల పాలనలో ఉండే ఒక స్వతంత్ర దేశం. ప్రపంచంలో 3వ ఎత్తైన శిఖరంగల కాంచనగంగ పర్వతం సిక్కిం, నేపాల్ ప్రాంతంలో విస్తరించి ఉంది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని తనలో ఇముడ్చుకోవడం వల్ల సిక్కిం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. అలాంటి సిక్కిం గురించి మరిన్ని విశేషాలు...
భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతంలోని రాష్ట్రాలలో ప్రకృతితో నిండిన ఎంతో అందమైన ఒక అద్భుత ప్రదేశం సిక్కిం అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. జీవితకాలంలో ఒక్కసారైనా చూడదగిన సుందర ప్రదేశం. ఇంతటి సుందరమైన రాష్ట్రం ఎన్నో ప్రత్యేకతలతను, మరెన్నో విశేషాలను కల్గి ఉంది.
పురాతన బౌద్ధ సంస్కృతి
ఇక్కడ ఉన్నటువంటి పురాతన టిబెట్ బౌద్ధ సంస్కృతికి చెందిన అనేక కట్టడాలు సందర్శకులను ఎంతో ఆకర్షిస్తాయి. చైనా, నేపాల్, భూటాన్ సరిహద్దులుగా ఉన్న రాష్ట్రం సిక్కిం. హిమాలయ పర్వత పంక్తుల్లో భాగమైన సిక్కిం భారతదేశంలో సందర్శించడానికి అత్యంత ప్రాచుర్యం పొందింది. సిక్కింలో పర్వత సౌందర్యం, పురాతన టిబెట్ బౌద్ధ సంస్కృతికి చెందిన అనేక కట్టడాలు సందరంగా కనిపిస్తాయి.
పూల లోయల సోయగాలు
సిక్కింలోని పర్వతాలు అదేవిధంగా పూల లోయల సోయగాలు ఏ వయసు వారినైనా ఇట్టే ఆకట్టుకొంటాయి. ఇక్కడి పర్యాటక ప్రాంతాల మధ్య దూరం చాలా తక్కువగానే ఉన్నా వాటిని చేరుకోవడానికి ఎక్కవ సమయం పడుతుంది. కొండాకోనల మధ్య నుండి ప్రయాణం చేయవలసి రావడమే దీనికి ప్రధాన కారణం. అయినా అక్కడికి చేరుకొన్నాక మనం పడిన అలసటలన్నింటినీ మరిచిపోతాం.
సిక్కింకి ప్రవేశ ద్వారం
ఇంతటి అందమైన సిక్కింలో చూడదగిన పర్యాటక ప్రాంతాలలో లెగ్షిప్ ఒకటి .ఈ అందమైన పట్టణాన్ని పశ్చిమ సిక్కింకి ప్రవేశ ద్వారంగా చెబుతారు. పశ్చిమ సిక్కింలోని చిన్న పట్టణమైన లేగ్షిప్ అతి తక్కువ కాలంలోనే గొప్ప పర్యాటక ప్రాంతంగా గుర్తింపు పొందింది. లెగ్షిప్ చుట్టు పక్కల చూడదగిని ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి.
ఆకర్షణీయమైన రంగిత్ డ్యాం
సిక్కింలోని రంగిత్ డ్యాం అత్యంత ఆకర్షణీయమైనది. ఇది రజింత్ నదీలో గుర్తించబడింది. ఇది సిక్కిం ప్రజల కోసం లేగ్షిప్ ప్రజల కోసం హైడ్రో ఎలక్ట్రిక్ కోసం నిర్మించబడిన మొట్టమొదటి డామ్. ఈ డ్యాం నుండి నీటిని సమీకరించి ఈ పట్టణంలోని రంజిత్ వాటర్ వరల్డ్ అమ్యూజ్మెంట్ పార్కుకు ఉపయోగిస్తారు. చిన్న, పెద్ద తేడాలేకుండా ప్రతి ఒక్కరికీ ఈ ప్రాంతం నచ్చుతుంది. ఇక్కడ ఎన్నో రకాల వాటర్ గేమ్స్ అందుబాటులో ఉండటమే దీనికి ప్రధాన కారణం.
సాహస ప్రియులకోసం
సిక్కింలోని పర్యాటక ప్రాంతాలలో సందర్శకులను విశేషంగా ఆకర్షించే వాటిలో రంజిత్ వాటర్ వరల్డ్ ఒకటి. ఇది సాహస ప్రియులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందమైన పరిసరాల మధ్య ఉన్న ఈ వాటర్ వరల్డ్ రంజిత్ ఆనకట్ట నుండి బైట నీటితో ఏర్పాటుచేయబడిన సరస్సు. లేగ్షిప్కి సమీపంలోని ఈ వాటర్ వరల్డ్ రివర్ రాఫ్టింగ్, యాన్గ్లింగ్, చేపలు పట్టడం, బోటింగ్, స్విమ్మింగ్ వంటి ఎన్నో ఏర్పాటుచేశారు. ఈ వాటర్ వరల్డ్ లేగ్షిప్లోని స్థానికుల సహకారంతో ఏర్పాటుచేయబడింది.
కిరతేశ్వర్ మహాదేవ టెంపుల్
ఈ ఆలయం ప్రసిద్ధ హిందూ పురాణం మహాభారతానికి చెందినా అనేక పౌరాణిక భాగాలను తెలియచేస్తుంది. అంతేకాకుండా ఇక్కడ శివుని ఆలయమే కాకుండా, దుర్గాదేవి, శ్రీరామునికి చెందిన ఆలయాలు కూడా ఉన్నాయి. వీటివల్ల హిందువులలో లేగ్షిప్ ప్రధాన యాత్రాస్థలంగా పేరుగాంచింది. కిరతేశ్వర్ మహాదేవ మందిరం రంజిత్ నది ఒడ్డున ఉంది. ఇది పర్యాటకులలో ప్రార్ధనకు ప్రసిద్ధ ప్రదేశం. ఈ ఆలయం పెల్లింగ్ నుండి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వేడినీటి బుగ్గ
బోరాంగ్ అనేది ఒక సహజసిద్ధమైన వేడినీటి బుగ్గ. ఇది రవన్గ్లా నుంచి 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తే చర్మరోగాలన్నీ నశించిపోతాయని నమ్ముతారు. రంగిత్ నదీ తీరంలోనే ఈ వేడినీట బుగ్గ ఉంటుంది. ఇక్కడ ఔషధ గుణాలు కలిగి ఉన్నాయని నమ్మకం. ఈ నీటి చెలమని స్థానికులు 'ఫు చ చు గంధకపు స్నానం' అని పిలుస్తారు.
ల్హో ఖండో సంగ్ ఫో గుహలు
ల్హో ఖండో సంగ్ ఫో గుహలు లేగ్షిప్లోని గంధకపు వేడినీటి చెలమల సమీపంలో ఉన్నాయి. ఎనిమిదవ శతాబ్దంలో రింపోచే గురువు ధ్యానం కోసం ఉపయోగించిన నాలుగు గుహలలో ఇది ఒకటి. చ్యంగ్ లహరి న్గింఫు, శర్చో ఫేఫు, నుబ్ దేచెంఫు ఇతర మూడు గుహలు. ఈ గుహలు అత్యంత ప్రసిద్ధి చెందిన బౌద్ధ యాత్రా స్థలాలుగా కూడా భావించబడతాయి. పశ్చిమ బెంగాల్, నేపాల్, భూటాన్ నుండి భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శించి, పవిత్ర ఫు చ చు లో మునక వేస్తారు.
ఆహ్లాదరకరమైన వాతావరణం
లేగ్షిప్లో ఏడాది పొడవునా మంచుతో, చల్లని వాతావరణం ఉంటుంది. మీరు రద్దీగా ఉండే నగర జీవితంనుండి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడి ప్రకృతి ఒడిలో సేద తీరవచ్చు.
వెళ్ళాలంటే..?
సిక్కిం వెళ్లడానికి రైలు మార్గంలో మొదట న్యూజలపాయిగురి అనే ఊరి వరకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నుండి డార్జిలింగ్కు వాయువ్యంగా 95కి.మీ దూరంలోనూ, సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ కు ఈశాన్యంగా 125కి.మీ దూరంలోనూ ఉన్నాయి.
Authorization