జుబ్బా లేదా జుబ్బాట్ హాయిల్... సౌది అరేబియాలోని అత్యంత ముఖ్యమైన ప్రాచీన ప్రదేశాలలో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది వేలాదిగా పర్యాటకులు సందర్శించే ఓ అందమైన ఎడారి ఈ జుబ్బా. అలాంటి చారిత్రక పర్యాటక ప్రాంతంలో పర్యటించి వచ్చిన నా అనుభవాలను ఈ రోజు జరదేఖోతో పంచుకుంటున్నాను.
ఇది హాయిల్ నగరానికి ఉత్తరం వైపు 90 కిలోమీటర్లు (56 మైళ్ళు) దూరం లో ఉన్నది. నజద్, తూర్పు మధ్యధరా సముద్రం మధ్య పాత కారవాన్ రహదారిపై ఈ నగరం ఉంది. 20,000 మంది జనాభా కలిగిన చిన్న ప్రాంతం ఇది. జుబ్బా సౌది రాజధాని అయిన రియాద్‌కు 694 కి.మీ, జెద్దా నుంచి 418 కి.మీ, మదీనా నుంచి 745 కి.మీ.దూరంలో ఉంటుంది. ఈ ప్రాంతం పూర్తిగా నెఫుడ్ ఎడారి చుట్టూ ఉన్నప్పటికీ నీటి వసతి సమృద్దిగా ఉండి విస్తారమైన వ్యవసాయానికి అనుకూలమైన ప్రదేశం. దీనిని 2015 లో ఖచీజుూజఉ వరల్డ్ హెరిటేజ్ జాబితాలో చేర్చారు. ఇక్కడ పర్యాటకులకు రాతియుగంలోని చూడదగిన పురాతన రాళ్ళతో తయారు చేసిన, పర్వతాల ఉపరితలాలపై చెక్కడాలు, చిత్రాలు లాంటి ముఖ్యమైన శిల్పకళల అవశేషాలు 9,000 సంవత్సరాల నాటివి ఉన్నాయి.
సిన్మాన్, ఘౌట పర్వతాలు
ఈ పర్వతాల మీద చెల్లాచెదురైన అనేక శిల్ప కళలు, తముడిక్ డ్రాయింగ్లు గుర్తించబడినాయి. ఉమ్మ్-సిన్మాన్కు అర్ధం 'మూపురాలు-తల్లి' ఈ పర్వతాలు నేల మీద ఉన్న రెండు మూపురాలు కలిగిన ఒక ఆడ ఒంటెను పోలి ఉంటుంది. దీనిపై 5,431 తుముడిక్ శిల్పాలు, 1,944 జంతువుల చిత్రాలు, 262 మానవ చిత్రాలు ఉన్నాయి.కాలక్రమంలో పర్వతాలపై ఉన్న రేఖాచిత్రాలు, శిల్పాలు ఈ ప్రాంతంలో నివసించే మానవులు, జంతువుల రోజువారీ జీవితాలను వర్ణిస్తాయి.
అందమైన శిలా చిత్రాలు
రాతి శిలలపై చెక్కబడిన చిత్రాలు నియొలిథిక్, పాలి యొలిథిక్ కాలం నాటి శిల్పాలను తలపిస్తాయి. పురాతత్వ పరిశోధకుల ప్రకారం ఇవి 3,000 సంవత్సరాల కిందటి థమాడిక్ యుగానికి చెందినవి. ప్రాచీన కాలం నాటి అరేబియన్ పెనిన్సులా(ద్వీపకల్పం) లో జీవించిన వారి జీవన విధానం, జంతువులను మచ్చిక చేసుకున్న వైనం తెలియజేస్తున్నాయని ఆర్కియోలాజిస్టులు తెలిపారు. ఈ రాతి శిల్పాల పై చెక్కబడిన కొన్ని పురుషుల తలపాగలు, హిరణాలు, పక్షులు, కోతులు, ఒంటెల పెంపకం, ఈటెలను చేతులలో పట్టుకొని వేటాడుతూన్న చిత్రాలు, చక్రాల బండిని లాగుతున్న రెండు జంతువులు శిలాచిత్రాల ద్వారా వెలుగులోకొచ్చాయి.
పూర్వీకుల ఉనికి...
ఉమ్మ్ సిన్మాన్ హిల్ శ్రేణి పాదాల వద్ద ఒకప్పుడు ఉన్న సరస్సు ఇప్పుడు అదృశ్యమయింది. ఇది ఆ కాలంలో గ్రేట్ నెఫడ్ ఎడారి దక్షిణ భాగంలో ప్రజలకు జంతువుల కోసం తాజా నీటి వనరుగా ఉండేది. జుబ్బాలోని శిలల ముఖాలపై అనేక చిత్రాలు, రాతలు, శాసనాలు ఉన్నాయి. ఇవి పూర్వ చారిత్రక కాలం నుండి మానవ, జంతువుల యొక్క అనేక ప్రాతినిధ్యాలను చూపిస్తుంది. నేటి అరబ్‌లు వీటి ద్వారా తమ పూర్వీకుల ఉనికిని గుర్తించారు.
సారవంతమైన భూములు
జుబ్బాను 1845లో ఫిన్నిష్ ఓరియంటలిస్ట్, అన్వేషకుడు జార్జి ఆగస్ట్ వాల్లిన్ సందర్శించారు. వాలిన్ అక్కడి విశాలమైన మట్టి గృహాలను వర్ణించాడు. ప్రతి ఇల్లు నీటి సౌకర్యం కలిగి ఉంది. ఇక్కడ ఒంటెలను నీటిని లాగేందుకు ఉపయోగించేవారు. ఈ పట్టణంలో 170 గృహాలు ఉన్నాయి. ఇందులో ఉన్నవారు శమ్మర్ వంశానికి చెందిన అల్ రామల్ తెగవారు. వీరు స్థిరనివాసం లేనివారు. బెడుయిన్స్ (దీవసశీబఱఅర) గా ఉన్నప్పటికీ వారు శాశ్వత గృహాలలో స్థిరపడ్డారు. ఇక్కడి భూములు సారవంతమైనవి. పశువుల మేత కోసం ఇతర ప్రదేశాలనుంచి బెడుయిన్స్ తరచుగా జుబ్బ ప్రాంతానికి వచ్చేవారు అని రికార్డ్ చేశారు.
రాతి చిత్రాల చరిత్ర
పాశ్చాత్య దేశస్థుల పర్యాటకులు జుబ్బా నగరం సందర్శించడం అనేది తమ జీవితంలో ఓ ముఖ్యమైన
కార్యక్రమంగా భావిస్తారు. సౌది ప్రభుత్వం పర్వతాలపై, రాతి శిలలపై చెక్కబడిన రాతి చిత్రాలను తిలకించడానికి ఏర్పాటు చేసిన చెక్క మెట్లవరకు వెళ్లడానికి ప్లాట్ ఫారంలు, చారిత్రాత్మక రాతి చిత్రాల చరిత్ర, వాటి అర్ధాలను వివరించడానికి బహు భాషా సంకేతాలను పొందుపరిచింది. అంతేకాదు ఇక్కడి విపరీతమైన వాతావరణాన్ని తట్టుకోవడానికి కొన్ని సూచనలు కూడా చేసింది.
సందర్శకులకు అనుకూలంగా...
అతి ప్రాచీన పర్వతాలు, శిలలు, శిల్పాలు లోయలు చూడడానికి మక్కువ ఉన్నవారికి సౌది అరేబియాలో ఇలాంటి ప్రదేశాలు కోకొల్లలు. అలాంటివాటిలో హైల్ ప్రదేశంలొ ఉన్న జుబ్బ నగరం ఒకటి. ఇటీవలి కాలంలో, సౌదిప్రభుత్వం ఈ ప్రదేశాన్నీ ఆకర్షణీయంగా మలచడానికి జుబ్బతో పాటు దాని చుట్టుప్రక్కల ఉన్న ప్రదేశాన్ని కొన్ని ప్రాజెక్టులుగా రూపొందించింది. ప్రజలకు అనుకూలంగా ప్రయాణ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. అలాగే రాక్ డ్రాయింగులను తిలకించడానికి పాదచారుల కోసం వాక్‌వేస్, వేదికలను నిర్మించింది.
Authorization