భారతదేశం కొన్ని అత్యద్భుతమైన వంతెనలకు సాక్షిభూతంగా నిలిచింది. ఎన్నో ఏండ్ల తర్వాత కూడా అవి తమ పట్ల ఆరాధనను చెక్కు చెదరనీయకుండా నేటికీ నిలిచిఉన్నాయి. వెనుకటి కాలంలో నిర్మించిన అనేక వంతెనలు ఆనాడే సాంకేతికంగా ఎంతో అధునాతనంగా ఉన్నాయి. అలాంటి అత్యాధునిక వంతెనల్లో భారత దేశంలో కాలపరీక్షకు తట్టుకుని నిలిచిన కొన్ని వంతెనల్లో హౌరా వంతెన ఒకటి. దాని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం...
న హౌరా బ్రిడ్జ్ ఓ అద్భుతమైన నిర్మాణం. ఇది పశ్చిమ బెంగాల్లో హుగ్లీ నదిపై ఉన్న కాంటిలివర్ వంతెన. పూర్తిగా ఉక్కుతో నిర్మించారు. 1936లో ప్రారంభమై 1942లో పూర్తయింది. ఇది 1943లో రాకపోకల కోసం ప్రారంభమైంది. తర్వాత దీనికి సమాంతరంగా మరో వంతెనెను కూడా నిర్మించారు. హౌరా, కలకత్తా నగరాలను కలుపుతూ నిర్మించిన ఈ వంతెన కలకత్తా నగరానికి ఆయువు పట్టు. నట్లు, బోల్టులు లేని అరుదైన వంతెనల్లో ఇది ఒకటి. మొత్తం రివిట్లతో నిర్మించిన మొదటి వంతెన ఇది.
న ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన వంతెనల్లో ఇదొకటిగా పేరొందింది. వాస్తవంగా చెప్పాలంటే దీని పేరు 'న్యూ హౌరా బ్రిడ్జ్'. హౌరా -కోల్ కత్తాలను కలిపేందుకు నిర్మించిన ఓ బల్ల కట్టు వంతెన. దీని స్థానంలో మళ్లీ నిర్మించారు కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. అయితే రెండు దశాబ్దాల తర్వాత జూన్ 14, 1965లో దీని పేరును నోబెల్ గ్రహీత, ప్రముఖ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో 'రవీంద్ర సేతు'గా మార్చారు. కానీ అందరూ హౌరా బ్రిడ్జ్ అనే పిలుస్తారు.
న ఇది ప్రపంచంలోనే నాల్గవ అతి పొడవైన కాంటిలివర్ సస్పెన్షన్ వంతెన. ఈ వంతెన 2వ ప్రపంచ యుద్ధం కాలంలో నిర్మించబడినది.
న ఈ బ్రిడ్జ్ నిర్మాణం తర్వాత కోల్ కత్తా నగర రూపు రేఖలు మారిపోయాయి. ఈ బ్రిడ్జ్ ఇప్పుడు ప్రపంచంలో 6వ అతి పెద్ద వంతన. కోల్ కత్తా పోర్ట్ ట్రస్ట్ 2150 అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ వంతెన దాని పునాది నుండి 280 అడుగుల ఎత్తులో ఉంది.
నఈ బ్రిడ్జ్ పై అనేక హిందీ చలన చిత్రాలను కూడా షూట్ చేశారు. ఈ వంతెన సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్, రాజ్ కపూర్, రోలాండ్ జోఫ్ఫ్, మీరా నాయర్ నిర్మించిన పలు చిత్రాలలో కన్పిస్తుంది. సుప్రసిద్ద తెలుగు చలన చిత్ర నటుడు చిరంజీవి నటించిన చిత్రంలో హౌరా బ్రిడ్జ్ పై సూపర్-హిట్ పాట ఉంది. కోల్ కత నగరాన్ని సందర్శిచిన వాళ్లుఆనాటి అద్భుత టెక్నాలజీని వీక్షించాలంటే తప్పక ఈ బ్రిడ్జిని సందర్శించాల్సిందే.
న ఈ వంతెన హౌరా రైల్వే స్టేషన్కు సమీపంలోనే ఉంటుంది. బ్రిటిష్ వారు తమ సౌకర్యం కోసం నిర్మించిన ఈ రైల్వేస్టేషన్ ఎంత చూసినా సరిపోదు. భారతదేశంలోనే అతి పెద్ద రైల్వే కాంప్లెక్స్ ఇది. 1851లో (సుమారు 160ఏండ్ల కిందట)నిర్మించిన రైల్వే స్టేషన్ ఇది.
న హౌరా స్టేషన్ ప్రాంగణంలోనే రైల్వే మ్యూజియం ఉంది. భారతీయ రైల్వే చరిత్రను ఈ మ్యూజియం విప్పి చెప్తుంది. ప్రపంచంలో అతి పెద్ద నెట్వర్క్ ఉన్న వ్యవస్థ మన రైల్వేలది. పొగబండి దగ్గరి నుండి రైల్వేల్లో పరిణామ క్రమంగా వచ్చిన మార్పులు ఈ మ్యూజియంలో ప్రతిఫలిస్తాయి..
Authorization