ప్రపంచంలో అందాలకు కొదవలేదు. కొండలు, కోనలు, పచ్చని అడవులు, ఏరులు, సెలయేళ్లు, జలపాతాలు.. ఒకటేమిటీ ఎన్నో అందాలను కళ్లారా ఆశ్వాదిస్తే ఆ ఆనందమే వేరు. అందుకే చాలామంది నిత్యం ఆనంద ప్రపంచంలో విహరిస్తుంటారు. అంతేకాదు, బోలెండంత ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకుంటున్నారు. అదెలాగో చూడండి.
రోగ నిరోదక శక్తి పెరుగుతుంది: సరికొత్త ప్రాంతాలు, వాతావరణంలో విహారం వల్ల శరీరంలో శక్తివంతమైన యాంటిబయోటిక్స్ ఏర్పడతాయి. దీనివల్ల రోగ నిరోదక శక్తి పెరుగుతుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది: ట్రావెలింగ్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మీలో సంతోషాన్ని పెంచి, డిప్రెషన్ నుంచి గట్టెక్కిస్తుంది. మీరు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ ఉత్సాహం కొనసాగుతోంది.
మెదడు చురుగ్గా: ట్రావెలింగ్ మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది. కొత్త వ్యక్తులు, కొత్త అనుభవాలు సరికొత్త అనుభూతి నిస్తాయి. దీనివల్ల మెదడు చురుగ్గా పని చేస్తుంది. ట్రావెలింగ్ చేసేవారిలో క్రియేటివ్ ఆలోచనలు పెంపొందుతాయని పలు సర్వేలు పేర్కొన్నాయి.
గుండె జబ్బుల ముప్పు ఉండదు: విహార యాత్రల వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. ట్రావెలింగ్ వల్ల ఒత్తిడి, ఉద్వేగం తగ్గుతుంది. ట్రావెలింగ్ చేయనివారితో పోల్చితే ఏడాదికి కనీసం ఒక్కసారైనా ట్రావెలింగ్ చేసే స్త్రీ, పురుషుల్లో గుండె జబ్బులు ఏర్పడే అవకాశం తక్కువగా ఉన్నట్లు ఫ్రామింగ్‌హమ్ హార్ట్ స్టడీ పేర్కొంది.
ఫిట్‌గా ఉంచుతుంది: ఫిట్‌గా ఉంటేనే ట్రావెల్ చేయాలి అనుకుంటే పొరపాటే. ట్రావెలింగ్ ద్వారా కూడా ఫిటనెస్ పొందవచ్చు. కొత్త ప్రాంతాలను చూస్తూ ఎంత దూరం నడుస్తున్నామో తెలీదు. దీనివల్ల మీకు తెలియకుండానే ఫిట్నెస్ పొందుతారు.
ఆరోగ్య ప్రయాణం: పచ్చని కొండలు, అడవుల్లో విహరించడం, జలపాతాల్లో స్నానం చేయడం వల్ల కూడా ఆరోగ్యం పెంపొందుతుంది. పచ్చని ప్రాంతాల్లో కాలుష్యం చాలా తక్కువ. ఔషద గుణాలు కలిగిన మొక్కలు నుంచి వీచే గాలి, వాటి మీదుగా ప్రవహించే జలాలు శరీరానికి మేలు చేస్తాయి.
ఆయుష్షు పెంచుతుంది: ట్రావెలింగ్ మీ ఆయుష్షు పెంచుతుంది. ట్రావెలింగ్ వల్ల శరీరానికి అన్నిరకాల వ్యాయామం లభిస్తుంది. కాబట్టి ఏడాదికి ఒక్కసారైనా మీకు నచ్చిన ప్రాంతంలో హాయిగా విహరించి రండి. ఆయుష్షు పెంపొందించుకోండి.
Authorization