హోసూర్ పట్టణం బెంగళూరు నరానికి 40 కి.మీ.ల దూరంలో ఉంది. ఇది తమిళ నాడులోని క్రిష్ణగిరి జిల్లా పరిధిలోకి వస్తుంది. బిజి గా వుండే పారిశ్రామిక పట్టణం అయినప్పటికీ అక్కడి ఆహ్లాదకర వాతావరణం, పుష్కలమైన పచ్చదనాలు ఈ ప్రాంతాన్ని ఓ పర్యాటక ప్రదేశంగా మార్చేసింది. ఇక్కడి చల్లటి వాతావరణం కారణంగా దీన్ని లిటిల్ ఇంగ్లాండ్ అని కూడా అంటారు. ఆటోమొబైల్ పరిశ్రమకు ప్రాధాన్య కేంద్రం.
టిప్పు సుల్తాన్ కాలంలో ఈ సిటీకి ఎంతో ప్రాధాన్యం ఉన్నది. బ్రిటిష్ పాలన లో ఇది టిప్పు సుల్తాన్ మైసూరు రాజ్యానికి బ్రిటిష్ రాజ్‌కు ఓ సరిహద్దుగా వుండేది. హోసూర్ను హోయసల రాజు రామ నాథ క్రీ.శ. 1290లో కనుగొన్నాడు. బ్రిటిష్ ఇండియా కంపెనీ దీనిని రెండు సార్లు (1768, 1791 లలో) గెలుచుకొంది. ఆ రోజుల్లో హోసూర్‌లో ఓ ప్రధానమైన కోట వుండేది. అది అందమైన స్కాట్లాండ్లోని కేనిల్ వర్త్ కేజల్ నమూనాలో వుండేది. ఇపుడు అది శిధిలమైంది.
గులాబీలకు ప్రసిద్ధి
హోసూర్ బ్రిటిష్ రాజ్‌లో వున్నపుడు సేలం జిల్లాకు రాజధానిగా వుండేది. పారిశ్రామిక నగరంగానే కాక ఈ పట్టణం మెల్లగా ప్రపంచంలో అత్యధికంగా గులాబీలు ఎగుమతి చేసే నగరంగా పేరు పొందుతోంది. ప్రతి సంవత్సరం ఇక్కడి నుండి కట్ రొసెస్కు 8 మిలియన్ల వరకూ అలాగే యూరోప్‌తో పాటు వివిధ ఇతర దేశాలకు పువ్వులు ఎగుమతి అవుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే రూ.150 కోట్ల పూవుల వ్యాపారం చేస్తోంది. అత్యధికంగా డిమాండ్ ఉండే 'తాజ్ మహల్' అనే గులాబి పూలు ఇక్కడి నుండి ఎగుమది చేయబడుతున్నాయి. అంతేకాకుండా అనేక ప్రధాన కంపెనీ లు ఇక్కడ తమ పరిశ్రమలను స్థాపించాయి.
ఆసక్తి కలిగించే ప్రదేశాలు
గత చరిత్ర వైభవం, ఆహ్లాదకర వాతావరణం, పోన్నియర్ నదికి పక్కనే వుండటంతో హోసూర్ వ్యాపరపరంగానే కాక పర్యాటక పరంగా కూడా అభివృద్ధి చెందినది. టూరిస్టులు వారాంతపు విహారాలకు ఇక్కడకు వస్తుంటారు. అందమైన కేలవరపల్లి డాం, రాజాజీ మెమోరియల్, చంద్ర చూదేస్వరార్ టెంపుల్ వంటి ప్రదేశాలు, చారిత్రక భవనాలు పర్యాటకులకు ఆసక్తి కలిగిస్తున్నాయి. స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో కలసి ఆనందంగా ఆ చుట్టుపక్కల ప్రాంతలను పర్యటించవచ్చు.
హోగినేకల్ వాటర్ ఫాల్స్
హోసూర్ ప్రధాన ఆకర్షనలలో ఆరుళ్ మిగు మరగాధంబాల్ సమేదకు అంకితం ఇవ్వబడిన హిల్ టెంపుల్, చంద్రచూదేశ్వరార్ టెంపుల్ ప్రధానం. మరో కొండపై హోసూర్‌కు 2 కి.మీ.ల దూరంలో మరొక ఆలయం ఉంది. ఈ టెంపుల్లో శ్రీ వెంకటేశ్వర విగ్రహం వుంటుంది. దీనిని అందరూ దక్షిణ తిరుపతి అంటారు. హోసూర్ కు 80 కి. మీ.ల దూరంలోని హోగినేకల్ వాటర్ ఫాల్స్ తప్పక చూడాలి.
కృష్ణగిరి డాం
ప్రకృతి ప్రియులైతే, కృష్ణగిరి కచ్చితంగా చూసి తీరాల్సిందే. ఇక్కడ ఎన్నో అడవి జంతువులు కనపడతాయి. అనేక జిల్లాలకు విద్యుత్‌ను అందించే కృష్ణగిరి డాం కూడా ఓ ఆకర్షణ. ఇంతేకాక హోసూర్ చుట్టుపట్ల హిల్ స్టేషన్లు కూడా ఉన్నాయి. 310 కి.మీ.ల దూరంలో కల మడికేరి, వయనాడ్ 290 కి.మీ., కూర్గ్ 280 కి. మీ. ఊటీ 296 కి. మీ.లు కోడై కెనాల్ 405 కి. మీ. లు ఉన్నాయి. ప్రసిద్ధ యాత్రా స్థలాలైన పుట్టపర్తి 190 కి. మీ., తిరుపతి 240 కి. మీ. కూడా ఇక్కడ నుండి వెళ్ళవచ్చు. ఇక్కడకు మహాబలిపురం బీచ్ 305 కి. మీ. లు, పాండిచేరి బీచ్ 270 కి. మీ. కల దూరంలో వుంటాయి.
Authorization