ప్రయాణమే మనిషి నాగరికతకు మూలం. ప్రయాణమే మనిషి జీవనగతిని మార్చేది. ఉన్న చోట ఉండిపోతే మనిషికి నాగరికతే లేదంటారు. అలా ఉండకూడదని మా ప్రయాణాన్ని ఇంకొంచెం ముందుకు సాగించాం. చలికాలంలో కేరళలోని మున్నార్ కాఫీ తోటలకు పెట్టింది పేరు. కాఫీ తోటల మధ్య నుండి పర్వతాలపై ప్రయాణిస్తే మేం పొందిన అనుభూతి వర్ణనాతీతం. పసి పిల్లల నిర్మలమైన మనసు వలె, మున్నార్ అందాలు మదిని దోచేశాయి.
మున్నార్‌లో ఉన్న హిల్ స్టేషన్, రోజ్ గార్డెన్, టీ ఫ్యాక్టరీ, మాట్టుపెట్టి డ్యామ్, ఈకో పాయింట్, సండల్ వుడ్ ఫారెస్ట్, ఎర్నాకుళం పార్కు, అక్కడి ప్రకృతి అందాలకు తార్కాణం. ఉదయం నుండి సాయంత్రం వరకు ఒక టాక్సీ మాట్లాడుకొని అన్ని స్థలాలను చూసివచ్చాం. ప్రకృతి అందాలు, పక్షుల కిలకిల రాగాలు, నిశ్శబ్ద లోయలు చూస్తుంటే అక్కడే ఉండిపోవాలని పించింది. అలా మేం తిరగాడిన ప్రదేశాల గురించి కొంత సమాచారం మీ కోసం...
మున్నార్ హిల్ స్టేషన్ : కేరళలోని అత్యంత సుందరమైన ప్రదేశాల్లో ఒకటి మున్నార్. ఇక్కడికి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తారు. మున్నార్ మూతిరపుళా, నల్లతన్ని, కుండాల అనే మూడు పర్వతా వాగులు సంగమంలో ఉన్నది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసేందుకు కేరళ రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. ఫలితంగా ఈ ప్రదేశం టూరిస్టులకు ఒక చక్కని పర్యాటక గమ్యస్థానంగా మారింది. పర్యాటకులు అత్యధికంగా సందర్శించే ప్రదేశాల్లో మున్నార్ టాప్ స్టేషన్ ఒకటి. మున్నార్ - తమిళనాడు రోడ్డులో, తమిళనాడు సరిహద్దుకు సమీపంలో 32 కిలోమీటర్ల దూరంలో ఈ టూరిస్ట్ స్పాట్ ఉంది. 1700 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పర్వతంపై నుంచి పశ్చిమ కనుమల అద్భుతమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి.
ఈ ఎత్తులో నిలబడి చూస్తే మేఘాలు మన చేతికందే దూరంలో కనిపిస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన నీలకురింజి పువ్వులు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ పువ్వులు పుష్కరానికి (12 ఏళ్లకు) ఓ సారి మాత్రమే పూయడం విశేషం. ఏడాది పొడవునా ఏ సమయంలోనైనా ఇక్కడ పర్యటన అద్భుతంగా ఉంటుంది. టాప్ స్టేషన్ కు దగ్గర్లో కురింజిమాల అభయారణ్యం, టాటా టీ మ్యూజియంలను చూడొచ్చు..
కుండల సరస్సు : మున్నార్ వెళ్లిన వారు తప్పక చూడాల్సిన ప్రదేశం కుండల సరస్సు. ఆహ్లాదభరిత వాతావరణం మధ్య కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే ఈ ప్రదేశం మున్నార్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. టాప్ స్టేషన్ కు వెళ్లే దారిలో ఉండడం వల్ల సులభంగా వెళ్లొచ్చు. 12 సంవత్సరాలకు ఓ సారి వికసించే నీలకురింజి పువ్వులకు కూడా కుండల సరస్సు ప్రసిద్ధి. ఈ సరస్సుకు సమీపంలో పర్యాటకులను ఆకర్షించే ఒక కృతిమ డ్యామ్ ఉంది. ఇది ఒక వంపు ఆకృతిలో నిర్మించిన ఆనకట్ట. డ్యామ్ కు అవతలి వైపు ఉండే ఈ సరస్సులో టూరిస్టులకు బోట్ రైడ్ సదుపాయం ఉంటుంది. పర్యాటకులు పెడల్ బోట్స్, రో బోట్స్, స్పీడ్ బోట్ లలో ప్రయాణించవచ్చు. 15 నిమిషాల రైడ్ కు ఒక్కొక్కరికి రూ.300 వరకూ ఛార్జీలు ఉంటాయి. గోల్ఫ్ ఆటను ఇష్టపడే వారి కోసం ఇక్కడి టాటా టీ గార్డెన్ కు దగ్గర్లో గోల్ఫ్ కోర్స్ కూడా ఉంటుంది.
మట్టుపెట్టి డ్యామ్ : మున్నార్ లో చూడదగ్గ మనోహరమైన ప్రదేశాల్లో మట్టుపెట్టి డ్యామ్ ఒకటి. టాప్ స్టేషన్ కు వెళ్లే మార్గం మధ్యలో ఉండడం వల్ల ఈ డ్యామ్‌ను సందర్శించే పర్యాటకుల సంఖ్య ఎక్కువ. అనముడి పర్వత శ్రేణుల మధ్యలో మున్నార్ కు 13 కిలోమీటర్ల దూరంలో మట్టుపెట్టి డ్యామ్ ఉంది. పచ్చని పర్వతాల మధ్య అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. ఈ డ్యామ్ వద్ద ఉండే సరస్సులో బోటింగ్ ను టూరి స్టులు బాగా ఎంజారు చేస్తారు
ఎర్నాకుళం నేషనల్ పార్క్ : మున్నార్ లో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఎర్నాకుళం నేషనల్ పార్క్ ఒకటి. కేరళలోని మొట్ట మొదటి వైల్డ్ లైఫ్ నేషనల్ పార్క్. అంతరించిపోతున్న నీలగిరి థార్ లు ఇక్కడ కనిపిస్తాయి. 97 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. నీలగిరి థార్లు అధికంగా ఇక్కడ ఉండడం కారణంగా ఇది వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించబడింది. థార్‌లతో పాటు ఇక్కడ అనేక అరుదైన జాతులకు చెందిన జంతువులు, పక్షులు, సీతాకోకచిలుకలు ఉన్నాయి. సీజన్ లో అందమైన నీలకురింజి పువ్వులతో ఇక్కడి పరిసరాలు ఎంతో సుందరంగా కనిపిస్తాయి.
రోజ్ గార్డెన్ : పర్యాటకులు తప్పక సందర్శించే ప్రాంతాల్లో రోజ్ గార్డెన్ ఒకటి. ఇక్కడ ప్రకృతి అందాలను చూస్తూ బిజీ లైఫ్ నుంచి కాస్త బయటపడొచ్చు. అందమైన రోజా పూల మధ్య ప్రశాంతంగా గడపడం ప్రతి ఒక్కరికీ మరపురాని అనుభూతి. పూలను ఇష్టపడే వారైతే రకరకాల పూలను రెండు నుంచి మూడు గంటలు సంతోషంగా గడిపేయ వచ్చు. పూలను కేవలం చూడడం మాత్రమే కాదు నచ్చినవి కోసుకోవచ్చు కూడా. కొన్ని పూలు నచ్చితే వాటి విత్తనాలను కూడా కొనుగోలు చేసి తీసుకువెళ్లవచ్చు. ప్రకృతి అందాలు మీలో కొత్త ఉత్సా హాన్ని నింపుతాయి. పచ్చని పర్వతాలు, లోయల మధ్య ప్రవహించే అందమైన నది, టీ, కాఫీ తోటలతో నిండి ఉండే పరిసరాలు ఈ ప్రదేశానికి కొత్త అందాలను తీసుకువస్తాయి. పర్యాట కులకు, ప్రేమికులకు, స్నేహితులకు, ట్రెక్కర్లకు, ఫొటో గ్రాఫర్లకు, అడ్వెంచర్ లవర్స్ కు కేరళ ఒక సరైన ప్రదేశం. ఎప్పటికీ గుర్తుండి పోయే అనుభవాలను తీసుకెళ్తారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
- యు.ఎల్లేష్
ఉస్మానియా విశ్వవిద్యాలయం
జాయింట్ రిజిస్ట్రార్ (రి)
7013029624
Authorization