ప్రపంచంలో ఏ ప్రాంతాన కాలుమోపినా.. కొత్తగా మనల్ని మనం ఆవిష్కరించుకోవచ్చు. ఉత్సాహాన్ని, ఉల్లాసాన్నిమూటగట్టుకోవచ్చు. కొత్త శక్తిని పుంజుకోవచ్చు. అందుకే పర్యటనలపై ప్రజలకు మక్కువ పెరిగింది. కాలం మారిందిఅని చెప్పడానికి ఆ దేశ పర్యాటక రంగంలో వచ్చిన అభివృద్ధినే ప్రామాణికంగా తీసుకోవచ్చు అనేదినిపుణుల అభిప్రాయం.
కోటి రతనాల వీణ తెలంగాణ రాష్ట్రంలో కూడా అనునిత్యం వేలాది, లక్షలాది పర్యాటకులు సందర్శించడం మనం చూస్తూనే ఉన్నాం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరం. ఈ నగరంలో ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు సుందరమైన పార్కులు, ఎన్నో రకాల ఎమ్యూజ్మెంట్ పార్కులు, దేశీయ పర్యాటకులను మాత్రమే కాకుండా ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. రాష్ట్ర పర్యాటక సంస్థ తెలంగాణ టూరిజం కూడా తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో రకాల ప్యాకేజీలను అందిస్తూ, పర్యాటక సంక్షేమానికి, పర్యాటక రంగ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నది. ఇటీవల కాలంలో దేశీయ పర్యాటక రంగం మాత్రమే కాకుండా అంతర్జాతీయ పర్యాటక రంగం కూడా విశేషంగా అభివృద్ధి సాధిస్తున్నది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకులు విదేశీ టూర్స్ పైన కూడా మక్కువ పెరగడం మూలంగా భారతదేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన విమానాశ్రయాలనుండి ఇతర దేశాల విమాన సర్వీసులు పెరగడం మనం చూస్తూనే ఉన్నాం. పర్యాటకరంగం ప్రజల జీవనవిధానాలను మారుస్తుంది. ప్రజల ఆలోచనలను మారుస్తుంది. మొత్తంగా ప్రపంచ గమనాన్నే మార్చే అద్భుత శక్తి పర్యాటకరంగానికి ఉంది.
Authorization