మన దేశంలో ప్రజలు ఫ్యాన్ల గాలికి సరిపడక, కూలర్లు, ఏసీలు అంటూ వెతుక్కుంటున్నారు. చల్ల గాలికోసం వెతుకుతున్నారు. ఇంత హాట్ సమ్మర్లో కూడా అక్కడమాత్రం జీన్స్, స్వెటర్స్, షూ తప్పని సరిగా వేసుకోవాలి. లేకపోతే చలికి గజగజ వణికిపోవాల్సి వస్తుంది. నగరం చుట్టూ 150 సరస్సులు ప్రవహిస్తాయి. కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలంటే కజకిస్థాన్ తప్పక చూడాల్సిందే.! ప్రపంచంలోనే అత్యంత చల్లని నగరాల్లో ఇదొకటి. ఈ మండుటెండల్లో వెళ్లి వేసవిని కాస్త చల్లగా మార్చుకోండి.
కజకిస్థాన్ అతి తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉన్న నగరాల్లో ఇదొకటి. శీతాకాలంలో మైనస్ 30నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రత నమోదు అవుతుంది. ఎనిమిది లక్షల మంది నివాసముంటారు ఇక్కడ. నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఈ నగరంలో ఉన్న నదిలో నీరు గడ్డకట్టిపోతుంది. ప్రయాణాలు సాగవు. అలాంటి వాతావరణంలో తిరిగాం. ఎందరో గొప్ప వ్యక్తులు తిరిగిన నేల మీద మేం తిరగడం ఎంతో అద్భుతంగా అనిపించింది.
ఇక కజకిస్థాన్ అనే పదం తరుక పదం. ఆదిమ జాతులైన కసక్ అనే జాతి నుండి వచ్చింది. ఈ కసస్ ప్రజలు నివసించే స్థలం అని అర్థం. కజకిస్థాన్ ఇంతకు మునుపు రష్యాలో భాగం. 13వ శతాబ్దంలో మంగోళియారాజు చంగీస్ఖాన్ పరిపాలన. 18,19 శతాబ్దంలో రష్యా పరిపాలన. ఇది సిల్క్ రూట్లో ఒక దేశం. సిల్క్‌రూట్‌లో వెళ్ళాలని ఎన్నో రోజుల నుండో ఉన్న కోరిక ఇప్పుడు తీరింది. ఈ మార్గంలో అలెగ్జాండర్ ది గ్రేట్ వెళ్ళినప్పుడు ''హియర్ రియల్ గేమ్ ఫర్ ద వారియర్ హర్స్ రైడర్'' అన్నారు. ''బెర్నాడు గ్రెహిమెక్'' జర్మనీ యాత్రికుడు కజకిస్థాన్ అద్భుతం అని పేర్కొన్నాడు. అలాగే హుయాన్‌త్సాంగ్ కజాన్ అనే రాజు తన రచనల్లో వర్ణించాడు. గొప్పవాళ్లు నడచిన ప్రదేశంలో తిరుగుతూ ఉంటే చాలా ఆనందమేసింది.
మా టౌన్ ప్యాకేజీలో ఒక అతను, అమెరికా నుండి ఇద్దరు ఆడవాళ్లు వచ్చారు. ఇద్దరు ఆడవారిలో ఒకమ్మాయి కెనడా ప్రాంతంలో సైంటిస్ట్‌గా పని చేస్తున్నారు. ఆ అమ్మాయి మాతో పరిచయం అయిన తర్వాత తన గురించి అడిగాను. ఆమె అంటార్టికాలో 48 డిగ్రీల చలిలో మూడు నెలలు మాత్రమే పని చేస్తారట. మిగతా తొమ్మిది నెలలు తనకు ఉద్యోగంలో సెలవులు. మూడు నెలలు ఏదైతే సంపాదిస్తుందో అదే మిగిలిన తొమ్మిది నెలలకు సరిపో యేంత జీతం. అందువల్ల తన తొమ్మిది నెలలూ ప్రయాణాలు చేస్తూనే ఉంటుందట. నాకు ఆ అమ్మాయి ఉద్యోగం చాలా నచ్చింది. ప్రయాణాలు ఇష్టమున్న వారికి నచ్చిన ఉద్యోగం. అంటే మూడు నెలలు తను ఉన్న ప్రదేశంలో ఎవ్వరూ మాట్లాడటానికి కూడా ఉండరు. ఆ స్థాలానికి మనం వెళ్లడానికి కూడా వీలు లేదు. అంతటి కఠోరమైన ప్రదేశం. ఒక పడవ వెళ్లడానికి ఒక నెలకో రెండు నెలలకో ఒకసారి వెళ్తుంది. వచ్చిన పడవ లేదా క్రెయిన్‌లో వారికి నెలకి సరిపడా ఆహారాన్ని తీసుకుంటారు. ఆ అమ్మాయి వంకా చాలా ఆశ్చర్యకరంగా చూశాను.
మాతో పాటు 20 రోజులు ట్రిప్‌లో ఉన్నారు. ఆ 20 రోజులు తాను ప్రతిరోజు 20 కి.మీ నడిచింది. తనకి ఆ ప్రాంతంలో ఎవ్వరూ మాట్లాడే వారు లేక ప్రతిరోజు అలా నడుస్తూనే ఉంటుందట. అది ఒక మంచి అలవాటు. ఆ అలవాటు వల్ల తాను మొత్తం కాలినడకన 35 కి.మీ నడుస్తూ యూరోప్ మొత్తాన్ని చుట్టి వచ్చింది. నేను మావారు ప్యాకేజీ లోకి వెళ్ళిన తర్వాత మేం ఉన్న 20 రోజులు ప్రతిరోజు 15 కి.మీ నడిచింది. ఒకరు తోడుగా ఉంటే అందరం ఫాలో అయ్యాం. చాలా సంతోషంగా గిరగిర అన్ని పార్కులు చుట్టి వచ్చాం. ఇకపోతే మాతో పాటు వచ్చిన అమెరికా అబ్బాయి చాలా తెలివైన వ్యక్తి. అతను ఒక ఎడిటర్‌గా పని చేశారట. అందరం కలిసి 20 రోజులు చాలా హాయిగా గడిపేశాం. మరుసటి పొద్దున్నే సిటీ టూర్ కు బయటు దేరాం. అక్కడ మ్యూజియమ్‌కు వెళ్లాం. అది ఒక సంగీత వాయిద్యాలతో కూడిన మ్యూజియం. ముందుకు వెళ్లగానే ఎంతో మంది సైనికులు బారులు తీరి ఉన్నారు. మేం అందరం త్వరగా పరుగెత్తుకుంటూ వెళ్ళి వారి మార్చ్ఫస్ట్ చూశాం. కొన్ని వీడియోలు, ఫొటోలు తీసుకొని వారి జాతీయ గీతం విని వారికి సెల్యూట్ కొట్టి మ్యూజియంలోకి వెళ్లాం. అందులో కజకిస్థాన్‌కు సంబంధించిన సంగీత పరికరాలు ఉన్నాయి. మిగతా ఐదు హాల్స్‌లో వివిధ దేశాలకు సంబంధించిన సంగీత పరికరాలు ఉన్నాయి.
మ్యూజియం తర్వాత ఒక పెద్ద సరస్సు చూశాం. ఆల్పైన్ రిజ ర్వాయర్. అక్కడ చిన్న పర్వతాలపై ఎక్కి ఫొటోలు తీసుకొన్నాం. ఎంత చూసినా తరగని అందం. అబ్బురపడి మూడు గంటలు అక్కడే కూర్చుని తనివితీరా చూసి మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాం.
- నర్మదా రెడ్డి
9849018510
Authorization