Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేస్తం లేని జీవితం
కెరటం లేని సముద్రమంటిది
కెరటం లేనీ సంద్రాన్ని
ఊహించ తరమా..?
స్నేహం కోసం తపించే
మనసును ఆపతరమా..?
ఇద్దరి భావాల కలయికకు
స్నేహం ఓ చుక్కాని వంటిది
అందరూ తరిమేసి
ఓదార్చేవారు లేరంటూ
మధనపడుతున్న నీ మనసును
అక్కున చేర్చుకునే
ఆత్మీయ పలకరింపు
ఒక్క స్నేహానికే సాధ్యం
గమ్యం కోసం వెదుకులాడుతున్న
ఒంటరి బాటసారికి
కష్టంలో నష్టంలో
సుఖంలో దుఃఖంలో
తోడు నిలిచేది
గమ్యాన్ని చూపేది
అసలైన స్నేహం మాత్రమే
మహా సముద్రం లాంటి
ఈ ప్రపంచాన్ని ఈదలేక
అలసిపోయిన నువ్వు
జీవితాన్నే ముగించాలనుకుంటె
చేయిపట్టి తీరం చేర్చేదే
నిజమైన స్నేహం
అందుకే స్నేహమా వర్ధిల్లు
- సలీమా,9490099083