Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్నేహం ఓ పరువలేని
మధుర జ్ఞాపకం
మనసులు అల్లుకుపోయిన
ఓ అందమైన హారం
మొదలయ్యేను బాల్యంలోనే
తెలియని అల్లరి స్నేహం
స్వచ్ఛమైన మనసుతో
చేసుకుంటారు సాయం
కాలంతో పాటు నేస్తాలలోనూ
పెరిగిపోతున్న ఈర్ష్యాద్వేషం
కలకలం రేపును చెలిమిలో
అడ్డువస్తున్న కులం
నిజం ఎరిగి మసులుకుంటే
పదికాలాలు పదిలం
బంధాలన్నింటిలోనూ
స్నేహామే పవిత్రం
ఆర్థిక సంబంధాలతో ముడిపడిన
జీవిత భాగస్వామ్యం
నేస్తం మాత్రం గాయానికి
మందురాసే చల్లని లేపనం
పేద ధనికుల మధ్య స్నేహం
నేటియుగంలో అసాధ్యం
సమాజ మార్పుకై
కొందరు మహనీయుల స్నేహం
మార్క్స్ ఏంగిల్స్
చే కాస్ట్రోల ఆదర్శ స్నేహం
చూడలేము సమాజంలో
ఇటువంటి స్నేహ బంధం
- శరత్ సుదర్శి , 7386046936