Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎర్రపూల స్నేహపు వనం లో
మొలచిన చిరు మొగ్గలం మనం,
విద్యార్థుల ఉద్యమం లో మండిన
నెత్తుటి ఉరుకుల బాటకట్టిన
బాటసారులం మనం
కులమేంటో తెలియని సన్నని
కలం చేతబట్టినోళ్లమే మనం
మతం కంటే అభిమతమే గొప్పదని
విశ్వసమానత్వం కోసం
బడు లెగ్గొట్టి మరీ తిరిగినోల్లం మనం
ఉద్యమ బాట బట్టినోళ్లమే మనం
విద్యార్థి సమస్యలనే ఆకలి దప్పులుగా
తలంచి గొంతెత్తి నిలిచినోళ్ళం మనం.
బహుదూరపు బాటసారులం
అయ్యామే గాని మనమిప్పుడు
ఆ తీయని స్నేహపు పరిమళాల
కౌగిలి నెన్నడు మరువం
మారి ఉండవచ్చు మన ఆశయ పధమిప్పుడు
కాని బతుకు బాట
నేర్పిన మన స్నేహం మీదొట్టు
నీతో నడిచిన ఆ అడుగుల మీదొట్టు
నిన్ను నన్ను కలిపిన ఆ బంధం మీదొట్టు
కలిసుంటాం కలకాలం ఎదురించి
ఎన్ని కెరటాల సమస్యలనైనా జయించి
విరజిమ్ముతాం కలకాలం స్నేహ పూల పరిమళాలు..
.. కామ్రేడ్ గంగాధర రావు కొసన