Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పుట్టుకతో
అంటిపెట్టుకున్నట్టు
కర్ణుని కవచకుండలాలుగా
కంటికి రెప్పలా కాచే
కన్నతల్లి పైట కొంగు
ఎండైనా వానైనా
ఎంటుండె తోడులాగ
కాపాడే గొడుగులాగా
కనిపెట్టుకు కాపాడే
కన్నతల్లి పైటకొంగు
ఏ దిష్టి పొంచుందో
ఏనుంచి ముంచేదో
ఆదమరిచి నువ్వున్నా
అతినీలపు కిరణాలను
అడ్డుకట్ట వేసినట్టు
అడ్డుకునే అమ్మ చెయ్యి
రంగులేని సంద్రానికి
రంగరించె నీలిరంగు
ఉప్పొంగకు నన్ను చేర
ఉప్పెనై ముంచకుండ
శాంతంగా ఉండమంటూ
సహౌదరిలా సాకుతుంది.
నీ ఒంటికి గాయమైన
ఏ రోగం వచ్చునో.. !
ఏ కాన్సర్ ముంచునో.. !
ఇంత మంచి జీవరాశి
అందమైన ఈ ప్రకతి
అగుపించకపోయేనో...!
ఏదో జోనులో
బందీకాకు బోనులో
భాద్యతగా కాపాడు
ఓ...జోను
భావి భారత బాలలకు
బహుమతివ్వు గ్రీన్... జోను.
- వి. పద్మ,
హైదరాబాద్.