Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అదిగో
అక్కడ తెగిపడ్డ
అక్షరాల తలలే
ఊపిరి నిడ్వలేక
కాలంతో పోట్లాడుతునై
ఎవడో పొడిచిన
వెన్నుపోటుకు
కండ్లు మూయలేక
కలంలో సిరానై
బతకాలని తండ్లాట
పారుతున్న రక్తనదిలో
ఆయువు తీరని అక్షరాలు
మునుగుతూ తేలుతూ
మునుం గట్టినయి
ప్రశ్నలను జ్వలింపజేస్తూ ..
నడిరేయి సుక్కల నడుమ
రాలిపోతున్న
అక్షర చినుకులు
భూమి తెరగట్టి చూసిన
ధిక్కార చూపులతోనే
నేలకు దిగుతున్నయి
అక్షరం కంఠంల
ఆరంగులాల
మేకులు దించిన
తన గొంతు
వినిపిస్తునే ఉంటుంది
అవి తెగిపడ్డ అక్షరాలైన
ఊపిరి నిడ్వని
ఊరి పొలిమెర
పహారా దివిటీలు
- బోల యాదయ్య
9912206427